ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. పొంచివున్న ముప్పు

By Arun Kumar PFirst Published Sep 20, 2018, 12:34 PM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. తీరం వెంబడి గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని పేర్కొంది. వాయుగుండం ఈ రోజు అర్థరాత్రి లేదా శుక్రవారం కళింగపట్నం-పారాదీప్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ఆర్డీవోలు, తహసీల్దార్‌లు, మండల, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తీరంలోని బోట్లు, వలలు, ఇతర సామాగ్రిని మత్స్యకారులు భద్రపరచుకోవాల్సిందిగా సూచించారు.

click me!
Last Updated Sep 20, 2018, 12:34 PM IST
click me!