ఆ కార్మికుల ఊపిరి తీయాలన్నదే జగన్ కుట్ర...: నారా లోకేష్ సీరియస్

Arun Kumar P   | Asianet News
Published : May 22, 2021, 12:14 PM ISTUpdated : May 22, 2021, 12:20 PM IST
ఆ కార్మికుల ఊపిరి తీయాలన్నదే జగన్ కుట్ర...: నారా లోకేష్ సీరియస్

సారాంశం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న కార్మికులను ఈ సందర్భంగా ఉద్యమాభివందనాలు తెలిపారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 

గుంటూరు: విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఉద్యమం వంద రోజులకు చేరుకుంది. అలుపెరగని పోరాటం చేస్తున్న కార్మికులను ఈ సందర్భంగా ఉద్యమాభివందనాలు తెలిపారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కరోనా కష్టకాలంలో స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ ను అందించి ప్రజల ప్రాణాలను కాపాడిన విషయాన్ని లోకేష్ గుర్తుచేశారు. 

''విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత 100 రోజులుగా పోరాటం చేస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనలు. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేసి కార్మికుల ఊపిరి తియ్యాలని జగన్ రెడ్డి కుట్రలు చేస్తుంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసి కరోనా రోగులకు ఊపిరి పోశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఇప్పటికైనా రాష్ట్రంలో దొంగ తీర్మానాలు, ఢిల్లీ లో పాదసేవ మాని చిత్తశుద్ధితో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం పోరాడాలి. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది'' అని లోకేష్  పేర్కొన్నారు.

read more  విశాఖ స్టీలు ప్లాంట్ కు .. ఆక్సీజన్ ట్యాంకర్ల వేగన్.. (వీడియో)

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్, నైట్‌ కర్ఫ్యూలను విధిస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే కరోనాపై పోరులో వ్యాక్సిన్, వెంటిలేటర్లు, బెడ్స్ ఇతరత్రా సామాగ్రి కొరత రాష్ట్రాలను వేధిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిదారులు చేతులెత్తేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరం నానాటికీ పెరుగుతోంది.

బాధితులకు చికిత్సలో కీలకమైన ప్రాణవాయువు సరఫరా ఎక్కడా ఆగకుండా కేంద్ర ప్రభుత్వం శ్రమిస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో స్టీల్‌ప్లాంట్లు ప్రధాన పాత్రపోషిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆక్సిజన్‌ ఉత్పత్తిలో ముందంజలో నిలుస్తూ రాష్ట్ర, దేశ ప్రజల ప్రాణాలను కాపాడుతోంది.

 కరోనా కట్టలు తెంచుకుంటున్న వేళ ప్రాణవాయువు కొరత లేకుండా ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారాలన్నింటికీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సెయిల్‌, విశాఖ స్టీల్‌ప్లాంట్‌, జేఎస్పీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ వంటి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉక్కు కర్మాగారాలు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి చేస్తున్నాయి.   

ఇక కరోనా బాధితుల చికిత్సలో అత్యవసరమైన మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిలో విశాఖ ఉక్కు కర్మాగారానిది ప్రముఖ స్థానం. గతేడాది కరోనా విజృంభించిన వేళలోనూ నిరంతరాయంగా ఆక్సిజన్‌ సరఫరా చేసిన ఘనత వైజాగ్ స్టీల్‌దే.నగరంలోని ప్రఖ్యాత కింగ్‌జార్జ్‌ ఆసుపత్రితో పాటు సమీప యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో వైజాగ్ స్టీల్ మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని విశాఖ ఉక్కు కార్మాగారం సిబ్బంది పేర్కొంటున్నారు.  

 

 

PREV
click me!

Recommended Stories

ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు | YS Jagan Attends Ugadi Panchanga Sravanam 2026 | Asianet News Telugu
AP Food Commission Appriciate Anganwadi Worker: అంగన్వాడి టీచర్ కు సత్కారం | Asianet News Telugu