విజయ సాయి రెడ్డి, శాంతి వివాదంపై స్పందించారు హీరోయిన్ పూనమ్ కౌర్. ఇలాంటి అనుభవమే తనకు ఎదురయ్యిందంటూ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండానే కీలక కామెంట్స్ చేసారు.
poonam kaur : పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ మధ్య ఏం జరిగిందో తెలియదుగాని చాలాకాలంగా ఇద్దరిమధ్య వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. పవన్ ఎప్పుడూ రియాక్ట్ కాలేదుగానీ అవకాశం చిక్కినప్పుడల్లా పూనమ్ కౌర్ మాత్రం రియాక్ట్ అవుతుంటారు. పవన్ కల్యాణ్ పై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కోపాన్ని వెళ్ళగక్కుతుంటారు పూనమ్ కౌర్.
అయితే తాజాగా వైసిపి రాజ్యసభ సభ్యులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు విజయసాయి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శాంతితో ఆయనకు అక్రమ సంబంధం వున్నట్లు... వీరికి ఓ కొడుకు కూడా వున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్వయంగా శాంతి భర్త మదన్ మోహన్ ఈ ఆరోపణలు చేస్తున్నాడు.
ఇలా విజయసాయి రెడ్డి, శాంతి లపై జరుగుతున్న ప్రచారంపై హీరోయిన్ పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయి, శాంతికి మద్దతుగా నిలిచారామే. ఇలాంటి పరిస్థితినే తాను కూడా ఎదుర్కొన్నానని... భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని పూనమ్ సూచించారు.
''వ్యవస్థలను టివి ఛానల్స్ బ్లాక్ మెయిల్ చేస్తాయి. వారికి తెలిసిన ఎజెండానే అమలుచేస్తూ మనం సరెండర్ అయ్యేలా చేస్తారు. కానీ వీరి ప్రయత్నాలను తిప్పికొట్టేలా గిరిజన మహిళా అధికారి శాంతికి అండగా నిలిచిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని అభినందిస్తున్నాను'' అన్నారు.
''నా విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆమె గర్భవతి, డబ్బులు తీసుకుని తీసుకుంది, అవకాశాల కోసమే చేసింది అన్నారు. ఇప్పుడు శాంతి విషయంలోనూ అలాగే చేస్తున్నారు. వీరికి భయపడిపోయి కన్నీళ్లు కార్చామో అదే తమ గెలుపుగా భావిస్తారు. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలోనే కాదు వృత్తిపరంగా ఎలాంటి పరిస్థితి ఎదురయినా ధైర్యంగా వుండండి. వారి ఒత్తిడికి, బెదిరింపులకు లొంగిపోయి తలొగ్గొద్దు'' అని సూచించారు.
''ఇలాంటి తప్పుడు ప్రచారాలను సృష్టించడమే కాదు వాటికి ఆదారాలు కూడా సృష్టించగలరు. కాబట్టి దైర్యవంతురాలైన మహిళగా వుండండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు విజయసాయి రెడ్డి అండగా నిలిచారు. ఆయన నిజానిజాలను వెలికితీసి నిందలు వేసినవారికి తగిన శిక్ష పడేలా చూస్తారు. మీకు ఎప్పటికీ అండగా వుంటారు. ధైర్యాన్ని కోల్సోకండి'' అంటూ ఎక్స్ వేదికన ట్వీట్ చేస్తూ మహిళా అధికారిని శాంతికి ధైర్యం చెప్పారు పూనమ్ కౌర్.
Be brave ✊ pic.twitter.com/tB2JlsYMol
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal)