నీ కూతుర్ని నా ఇంటికి పంపిస్తేనే....: పొందూరు ఎస్సై ఫోన్ సంభాషణ లీక్

Published : Aug 24, 2020, 12:04 PM ISTUpdated : Aug 24, 2020, 12:40 PM IST
నీ కూతుర్ని నా ఇంటికి పంపిస్తేనే....: పొందూరు ఎస్సై ఫోన్ సంభాషణ లీక్

సారాంశం

శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఎస్సై రామకృష్ణ అమ్మాయితో మాట్లాడిన ఫోన్ సంభాషణలు లీకయ్యాయి. ఓ కేసులో తన ఇంటికి రావాలంటూ మహిళను ఎస్సై బెదిరించాడు. 

శ్రీకాకుళం: కేసు లేకుండా చేయడానికి ఓ ఎస్సై దారుణమైన బేరం పెట్టాడు. నీ కూతురిని నా ఇంటికి పంపిస్తే కేసు గురించి ఆలోచిస్తానని శ్రీకాకుళం జిల్లా పొందూరు ఎస్సై ఓ వ్యక్తితో బేరమాడాడు. అతని కూతురితో కూడా అతను మాట్లాడాడు. ఈ ఫోన్ సంభాషణలు లీకయ్యాయి. దాంతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగుతోంది.

వివరాలు ఇలా ఉన్నాయి.... ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలోని పోలీసులు తుంగపేటకు చెందిన అప్పారావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 48 మద్యం సీసాలు బయటపడ్డాయి. దాన్ని ఆసరా చేసుకుని మహిళను లైంగిక వేధించడం ప్రారంభించాడు.

నీ కూతురిని నా ఇంటికి పంపిస్తే కేసు నమోదు చేసే విషయంపై ఆలోచన చేస్తానని రామకృష్ణ షరతు పెట్టాడు. లేదంటే కేసు నమోదు చేస్తానని బెదిరించాడు. తన ఇంటికి రావాలని రామకృష్ణ మహిళను కూడా వేధించడం ప్రారంభించాడు.  

ఎస్సై రామకృష్ణ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది, దాంతో వారు ఆరా తీశారు. ఎస్సై రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళతో ఎస్సై మాట్లాడిన మొబైల్ సంభాషణలు వైరల్ అవుతున్నాయి.

"

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?