అవనిగడ్డ ఎమ్మార్వో ఆఫీసు వద్ద జాతీయ జెండాకు అవమానం (వీడియో)

By telugu teamFirst Published Aug 24, 2020, 10:08 AM IST
Highlights

అవనిగడ్డ తాహిసిల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఓ జర్నలిస్టు ఆ విషయాన్ని ఎమ్మార్వోకు తెలియజేశార. అయితే ఎమ్మార్వో జర్నలిస్టుపై చిందులు తొక్కారు.

విజయవాడ: అవనిగడ్డ తాసిల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాకు అవమానం జరిగింది. తాసిల్దార్ కార్యాలయం వద్ద ముందు ఉన్న జాతీయ జండా వర్షానికి తడిసి ముద్దయి నేల మీద పడి ఉన్న పరిస్థితిని ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి వాట్సాప్ గ్రూపులో అధికారులకు తెలియజేశారు. దీనిపై స్పందించాల్సిసిన ఇన్ఛార్జి తాసిల్దార్ లతీఫ్ భాష వాట్సాప్ గ్రూప్ లో జాతీయ జెండా పరిస్థితిని పెట్టిన విలేఖరికి హెచ్చరికలు జారీ చేయడం జారీ చేశారు. 

దీనికి స్పందించిన మరి కొంతమంది జర్నలిస్టులు బాధ్యతాయుతమైన అధికారి జరిగిన పొరపాటుని సిబ్బందికి చెప్పి సరిచేయాల్సింది పోయి  విలేఖరికి హెచ్చరికలు జారీ చేయడం పట్ల తీవ్రంగా స్పందించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ సిబ్బంది జాతీయ జెండాను కార్యాలయ సిబ్బంది అప్పగించగా ఈ జాతీయ జెండాను తహశీల్ధార్ కార్యాలయ వరండా చూరులో కుక్కడం కొసమెరుపు. 

గతంలో కూడా పలు సమస్యలను జర్నలిస్టులు వాట్సాప్ గ్రూపు ద్వారా తెలియజేసిన పలు సందర్భాల్లో  ఈ తాసిల్దార్ పలుసార్లు హెచ్చరికలు జారీ చేయటం, దీనిపై వివాదాలు  జరిగాయి. అవనిగడ్డ తాసిల్దార్ కార్యాలయం ముందు జాతీయ జెండాకు జరిగిన అవమానాన్ని పురస్కరించుకొని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు జర్నలిస్టులు, ప్రజలు కోరుతున్నారు.

"

click me!