గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌పై పొలిటికల్ అటెన్షన్ .. అనంతలోనే ఎందుకు , చిరు ఏం మాట్లాడతారో..?

By Siva KodatiFirst Published Sep 28, 2022, 8:20 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ పట్ల పొలిటికల్ అటెన్షన్ నెలకొంది. చిరు పొలిటికల్ డైలాగ్స్ పేల్చడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆయనకు పీసీసీ డెలిగేట్ ఐడీ కార్డ్ ఇచ్చిన నేపథ్యంలో వాతవరణం వేడెక్కింది. 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ పట్ల పొలిటికల్ అటెన్షన్ నెలకొంది. చిరంజీవి ఏం చెబుతారు ..? రాజకీయాలపై ఏమంటారు అన్న ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల రాజకీయాలపై చిరంజీవి మాట్లాడిన వీడియో వైరల్ అవుతోన్న సంగత తెలిసిందే. రాజకీయాలకు నేను దూరంగా వున్నా.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పుట్టించాయి. ఇంతలోనే చిరంజీవికి కొత్త ఐడీ కార్డ్ జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ. 2027 వరకు పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ ఐడీ కార్డ్ ఇచ్చింది. రాజకీయాలపై చిరంజీవి కామెంట్స్ చేసిన తర్వాతి రోజే ఈ ఐడీ కార్డ్ రావడంతో మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ వుంటుందా అని జోరుగా చర్చ జరుగుతోంది. 

ఇలాంటి సమయంలో గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో ఏర్పాటు చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. చిరంజీవి స్పేస్‌లో పొలిటికల్ కామెంట్స్ వుంటాయా..? సినిమా ప్రమోషన్‌కే పరిమితమవుతారా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. దీంతో అందరి చూపు అనంతపైనే వుంది. తమ్ముడి కోసమే అనంతలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారా... జనసేనకి, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి లింక్ వుందా అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గాడ్‌ఫాదర్ సినిమాలోని పొలిటికల్ డైలాగ్‌పై చిరంజీవి స్పందించారు. తన డైలాగ్ ఇంతగా ప్రకంపనలు సృష్టిస్తుందని అనుకోలేదన్నారు. అయినా ఇది ఒక రకంగా మంచిదేనంటూ చిరు వ్యాఖ్యానించారు. 

ALso Read:చిరంజీవి సినిమాపై వైసీపీ నేత ట్వీట్... జనసైనికుల ముఖ చిత్రం ఏమిటో!

చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ.. పరోక్షంగా తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. యూపీఏ-2 హయాంలో కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఏపీ పునర్విభజన తర్వాత కొన్ని రోజుల పాటు రాజకీయాల్లో కనిపించారు. అయితే చాలా కాలంగా ఆయన యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే పలుమార్లు చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ వార్తలు వచ్చాయి.  కొన్ని నెలల క్రితం సినీ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సమయంలో కూడా చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై చర్చ సాగింది. 

click me!