తీరు మార్చుకోండి , 27 మంది ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ .. లిస్ట్‌లో బుగ్గన, తానేటి వనిత, బాలినేని...?

By Siva KodatiFirst Published Sep 28, 2022, 5:37 PM IST
Highlights

గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్ కార్యక్రమం హాట్ హాట్‌గా జరిగింది. ఈ సందర్భంగా 27 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు సీఎం జగన్. ఈ లిస్టులో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తానేటి వనిత... మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నాని వున్నారు. 

గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్ కార్యక్రమంలో 27 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. పేర్లతో సహా ప్రస్తావించి మందలించారు ముఖ్యమంత్రి. మొత్తం మీద వర్క్‌షాప్ వాడివేడిగా జరిగినట్లుగా తెలుస్తోంది. 175 సీట్లే టార్గెట్‌గా నేతలకు జగన్ దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. పనితీరు మార్చుకోవాలని వారిని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తానేటి వనిత .. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నాని పని తీరుపైనా సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు , మంత్రులు ప్రజల్లో ఉండాలని సూచించారు. దొంగ దారులను వేతకొద్దు అంటూ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు జగన్. 

దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ... కొంతమంది పనితీరు మార్చుకోవాలని సీఎం చెప్పారని తెలిపారు. అన్ని ఇళ్లు తిరగడం లేదని, కొందరు నేతల్ని మందలించారని పేర్ని నాని వెల్లడించారు. గడప గడపకూ తిరగని నేతలకు గ్రాంట్ రిలీజ్ చేయబోనని సీఎం స్పష్టం చేశారని ఆయన పేర్కొన్నారు. కొందరు నేతల పనితీరు సంతృప్తికరంగా లేదని సీఎం చెప్పారని.. ఏదో ఒక గంట తిరగకుండా రోజంతా జనంలో  ఉండాలని జగన్ అన్నారని పేర్ని నాని తెలిపారు. 27 మంది పనితీరు సంతృప్తి కరంగా లేదన్నారని.. నవంబర్ ఆఖరి వారంలో మరోసారి  మీటింగ్  ఉంటుందని జగన్ చెప్పారని పేర్ని నాని పేర్కొన్నారు. ప్రజాసేవను వృత్తిగా తీసుకోవాలని చెప్పారని.. ఎవరి పని తీరు ఏంటీ అనేది చివరి ఆరు  నెలల్లో చెప్తానని సీఎం అన్నారని పేర్నినాని వెల్లడించారు. 

click me!