భువనేశ్వరి కోసం కదిలిన అమరావతి మహిళా రైతులు... అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత (వీడియో)

By Arun Kumar PFirst Published Oct 3, 2023, 2:11 PM IST
Highlights

నారాా భువనేశ్వరిని పరామర్శించేందుకు వెళుతున్న అమరావతి మహిళా రైతులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలోనే పుట్టిపెరిగినా ఏనాడూ పాలిటిక్స్ వైపు తొంగిచూడని నారా భువనేశ్వరి భర్త అరెస్టుతో రోడ్డుపైకి వచ్చారు. ఇలా భర్త జైల్లో వుండటంతో బాధపడుతున్న ఆమెను పరామర్శించేందుకు వెళుతున్న అమరావతి మహిళా రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. 

రాజమండ్రిలో వున్న భువనేశ్వరిని కలిసేందుకు అమరావతి మహిళా రైతులు ప్రత్యేక బస్సులో బయలుదేరారు. అయితే వీరిని వీరవల్లి, నల్లజర్ల  టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాజమండ్రికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ బస్సును నిలిపివేసి డ్రైవర్ ను బలవంతంగా కిందకు దించారు. మహిళా రైతులను మాత్రం బస్సులోనే నిర్భంధించారు. బస్సు డోర్ కు అడ్డంగా నిలబడ్డ పోలీసులను తోసుకుంటూ కిందకు దిగేందుకు మహిళలు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుంది. 

Latest Videos

వీడియో

తమను అడ్డుకున్న పోలీసులు మహిళలు వాగ్వాదానికి దిగారు. రాజమండ్రి వెళ్లడానికి పోలీసుల అనుమతి ఎందుకు? అదేమైనా పాకిస్థాన్ లో వుందా లేదంటే మేమేమైనా శతృదేశం నుండి వస్తున్నామా? అంటూ మహిళా రైతులు పోలీసులు ప్రశ్నించారు. 

Read More  సిఐడి వద్దకు వెళ్లను... వాళ్లనే నాా దగ్గరకు రమ్మనండి..: హైకోర్టును కోరిన నారాయణ

తమతో పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని... బస్సు దిగకుండా అడ్డుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని అమరావతి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసారు. చివరకు వాష్ రూంకు వెళ్ళడానికి కూడా బస్సు దిగనివ్వడం లేదని...  అందుకు కూడా పోలీసుల పర్మీషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.ఇదెక్కడి దిక్కుమాలిన పరిపాలన... ఇలాంటి నీచ నికృష్ట పాలనను తాము ఎప్పుడూ చూడలేదన్నారు. ఇప్పటికైనా  ఆంధ్రులు కళ్ళు తెరిచి ఇళ్లలోంచి బయటకు రావాలని అమరావతి మహిళలు సూచించారు. 

రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతున్నా ఇప్పటికీ బయటకు రాకుంటే గాడిదలు, కుక్కల కంటే నీచమైన బ్రతుకు బతకాల్సి వస్తుందన్నారు. ఇది కేవలం ఏ ఒక్కరి సమస్యో కాదు ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య అన్నారు. ఇప్పటికే మన బ్రతుకులు అదోగతి పాలయ్యాయి... అయినా మేలుకోకుంటే గాండ్రించి ఉమ్మేస్తారు తప్పితే గుక్కెడు మెతుకులు కూడా వెయ్యరన్నారు. మీ చేతులారా మీరే చేసుకున్నారని ఇప్పటికే అంటున్నారన్నారు. వాళ్ల దినాలు, వారాలు ఎక్కడైనా చేసుకోని... మన బిడ్డల భవిష్యత్ ను మనమే కాపాడుకుందామని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు కదలాలని అమరావతి మహిళా రైతులు సూచించారు. 
 

click me!