నెల్లూరులోని మహలక్ష్మి ఆలయ సమీపంలో ఆదివారం నాడు ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. కిడ్నాప్ నకు గురైన చిన్నారిని కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
నెల్లూరు: పట్టణంలోని మహలక్ష్మి ఆలయ సమీపంలో ఆదివారం నాడు ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. కిడ్నాపైన చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. . చిన్నారి ఆచూకీ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఆరు మాసాల క్రితం సంతపేటలో ఓ చిన్నారిని దుండగులు కిడ్నాప్ చేశారు.సీసీటీవీ పుటేజీ ఆధారంగా దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఐదు నెలల చిన్నారి కిడ్నాప్ కావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో కిడ్నాప్ కేసులు అధికంగా నమోదౌతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకూరు పేటలో ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. ఇద్దరు చిన్నారులను స్కూటీపై తరలిస్తున్న సమయంలో నెల్లూరు సమీపంలో దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే విధంగా ఉదయగిరిలో స్కూల్ కు వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే స్థానికులు అప్రమత్తం అయి కిడ్నాపర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
undefined
జిల్లలోని దుత్తలూరులో కుటుంబ కలహలతో సోదరుడి కొడుకును కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.సోదరుడి కొడుకుని కిడ్నాప్ చేసి తెలంగాణలోని వరంగల్ మీదుగా వెళ్తున్న సమయంలో తెలంగాణ పోలీసుల సహాయంతో నెల్లూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్ చేసిన చిన్నారిని విక్రయించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. తన స్నేహితుడి వద్ద చిన్నారిని దాచిపెట్టాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
నెల రోజుల క్రితం గంగపట్నంలో చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు కొందరు ప్రయత్నించారు. చిత్తు కాగితాలు ఏరుకొనే పేరుతో వచ్చిన మహిళలు ఏడాదిన్నర చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ముగ్గురు మహిళలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆశోక్ నగర్ లో ఈ ఏడాది ఆగస్టు 15న ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాప్ నకు గురైంది. కిడ్నాపర్ ను నాలుగు గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.