ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శలు గుప్పించారు. దుష్టపాలనకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు.
గుంటూరు: దుష్టపాలనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆదివారం నాడు గుంటూరులో మీడియాతో మాట్లాడారు.ఓటు బ్యాంకు రాజకీయాలపైనే ఏపీ సీఎం జగన్ కేంద్రీకరించారని ఆయన ఆరోపించారు. ఏపీ రాష్ట్రం నుండి పెట్టుబడి పెట్టే సంస్థలను తరిమేస్తున్నారని ఆయన విమర్శించారు.వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని జీవీఎల్ చెప్పారు.జాతీయ జీడీపీలో 9 శాతం ఐటీ రంగం నుండే వస్తుందన్నారు. అలాంటి ఐటీ రంగాన్ని ఏపీ సర్కార్ నిర్వీర్యం చేసిందన్నారు. ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీల నేతలు హైద్రాబాద్ కు పరిమితమౌతున్నారన్నారు. గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో జగన్ హైద్రాబాద్ కే పరిమితమయ్యారన్నారు. ఇప్పుడు జగన్ సీఎంగా ఉంటే చంద్రబాబునాయుడు హైద్రాబాద్ కే పరిమితమయ్యారని జీవీఎల్ విమర్శించారు. ఒకరు జూబ్లీహిల్స్, మరొకరు లోటస్ పాండ్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు, జగన్ లపై బీజేపీ ఎంపీ విమర్శలు చేశారు.గెలిపిస్తేనే ఏపీలో ఉంటారా అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీలు తమ రాజకీయ అవసరాలపైనే దృష్టి కేంద్రీకరించాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అభివృద్దిని ఈ పార్టీలు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో దుష్ట పాలనను అందిస్తున్న వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తామని ఆయన చెప్పారు.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఏపీ రాష్ట్రంపై బీజేపీ కేంద్రీకరించింది. గత మాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు.ఈ సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మోడీతో భేటీ ముగిసిన తర్వాత వైసీపీపై పవన్ కళ్యాణ్ పై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. అదే స్థాయిలో వైసీపీ కూడా జనసేనపై ఎదురుదాడికి దిగుతుంది.
2024లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇప్పటినుండే రాజకీయ పార్టీలు సన్నద్దమౌతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. రాజకీయపార్టీల నేతల విమర్శలు,ప్రతి విమర్శలతో రాజకీయ వేడి రోజు రోజుకు ఉధృతమౌతుంది.