పాత కేసు తవ్వుతున్న పోలీసులు: మాజీ ఎంపీ జేసీకి షాకేనా?

By narsimha lodeFirst Published Jul 24, 2019, 6:23 PM IST
Highlights

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి పోలీసులు షాకిచ్చేందుకు సిద్దమౌతున్నారు. ఏడాది క్రితం కేసును తవ్వుతున్నారు.. ఈ కేసులో ఉన్నవారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్: ప్రభోదానంద ఆశ్రమంపై జరిపిన దాడులు, విధ్వంసాల కేసులు టీడీపీ నేతలను వెంటాడుతున్నాయి.ఈ కేసులో మరి కొందరిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

2018 సెప్టెంబరు నెల వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని తాడిపత్రి మండలం పెద్దపొలమడ గ్రామంలోని వినాయక విగ్రహాల ఊరేగింపు చిన్నపొలమడ వద్దగల ప్రబోధానంద అశ్రమం నుంచి వెళుతున్న సమయంలో దాడులు, ప్రతిదాడులు జరిగాయి.

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆధ్యర్యంలో అశ్రమానికి వ్యతిరేకంగా ఆందోళన చేప ట్టారు. వీటికి సంబంధించి టీడీపీ మద్దతుదారులపై ప లుకేసులు నమోదయ్యాయి.
అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండటంతో అరెస్టులు జరగలేదు. రాష్ట్రంలో ఆధికార మార్పిడి జరిగి వైసీపీ ప్రభుత్యం ఏర్పడ్డంతో పెండింగ్‌లోని అరెస్టులు ప్రారంభమయ్యాయి.

అప్పట్లో తీసిన వీడియోలు తదితర వాటి కారణంగా మాజీ ఎంపీపై కేసులు నమోదు చేసేందుకు పోలీసు ఆధికారులు సన్నద్దం అవుతున్నారన్న ప్రచారం ఉంది. మరోపైపు దాడులు, విధ్వంసాల్లో లేని వారిని సైతం అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

ఈ విషయమై కొద్ది రోజుల క్రితం ఎస్పీ సత్యఏసుబాబును మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కలిసి వాస్తవాలను, స్థానిక పోలీసు ఆధికారుల తీరును వివరించారని సమాచారం. ఈ కేసుల్లో చట్టం తనపని చేసుకొని పోతోందని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెబుతున్నారు.
 
తాడిపత్రి మండలం వీరాపురానికి చెందిన వైసీపీ మద్దతుదారుడు అనిల్‌కుమార్‌రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ మాజీ ఎమ్మెల్యే జేసీప్రభాకర్‌రెడ్డితో పాటు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన జేసీ పవన్‌ కుమార్‌రెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్వీ రవీంద్రారెడ్డిపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

click me!