
రాజకీయ నాయకుల పాదయాత్రల మీద ఆంధ్రప్రదేశ్ లో అంక్షలువిధిస్తున్నారు. ఇక ముందుకుపాదయాత్రలు చేసే వారు పోలీసుల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. తొందర్లో ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మహా యాత్రకు పూనుకుంటాడని వార్తలు వెలువడుతున్న తరుణంలో డిజిపి సాంబశివరావు ఈ విషయం వెల్లడించారు. ఇకముందు ఎవరైనా సరే పాదయాత్రలకు అనుమతి తీసుకోవలసిందే నని, ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు నియమాలననుసరించి పాదయాత్రలకు అనుమతి నీయడం జరుగుతుందని ఆయన ఈ రోజు అమరావతిలో విలేకరులతో చెప్పారు. 1994లో జరిగిన పాదయాత్రలను కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.
నియమాలను అమలు చేస్తే మెరుపు పాదయాత్రలు చేయడం కష్టమవుతుంది. దీనితో రాష్ట్రంలో జరిగే రాజకీయ పాదయాత్రలన్నీ ప్రభుత్వం అదుపులోకి వస్తాయి. ఆందోళనలు, ధర్నాలు సహా అన్ని కార్యక్రమాలకు పోలీసుల అనుమతి ఉండాలని డిజిపి అన్నారు.
కాపు రిజర్వేషన్ బహిరంగసభ సందర్భంగా జరిగిన తుని ఘటనలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వారి నుంచే నష్టపరిహారం వసూలు చేస్తామని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని సుప్రీంకోర్టు సూచనల మేరకు వసూలు చేస్తామన్నారు. తుని సంఘటన దృష్టిలోె పెట్టుకుని కాపు రిజర్వేషన్ నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి నిరాకరించే వీలుంది.
సాధారణంగా ప్రతిపక్ష సభ్యలు అసెంబ్లీకి రావడం కూడ పాదయాత్ర చేసుకుంటూ వచ్చేవారు. చాలాసందర్భాలలో హైదరాబాద్ లో అసెంబ్లీ నుంచి టాంక్ బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా లేదా అసెంబ్లీ విగ్రహంనుంచి అసెంబ్లీదాకా పాదయాత్ర చేసేకుంటూ వచ్చే వారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు అమరావతి లోజరుగబోతున్నందున ఇక ముందు ఇలాంటి నిరసనయాత్రలను పోలీసులు ముందుగా అనుమతి తీసుకోలేదని అనుమతించకపోవచ్చు.