చంద్రబాబు విడుదల : రాజమండ్రిలో పోలీసుల ఓవరాక్షన్ .. టీడీపీ నేతల వాహనాలకు అడ్డంగా బారికేడ్లు (వీడియో)

Siva Kodati |  
Published : Oct 31, 2023, 06:17 PM ISTUpdated : Oct 31, 2023, 06:19 PM IST
చంద్రబాబు విడుదల : రాజమండ్రిలో పోలీసుల ఓవరాక్షన్ .. టీడీపీ నేతల వాహనాలకు అడ్డంగా బారికేడ్లు  (వీడియో)

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు . అక్కడి నుంచి భారీ ర్యాలీగా అమరావతికి బయల్దేరారు చంద్రబాబు .  తమ అధినేతను చూసేందుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా అమరావతికి బయల్దేరారు చంద్రబాబు. దీంతో రాజమండ్రి జనసందోహంగా మారింది. తమ అధినేతను చూసేందుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. రాజమండ్రి దివాన్ చెరువు మీదుగా వేమగిరి వైపుగా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనను చూసేందుకు తరలివచ్చిన అభిమానులను రాజమండ్రి పోలీసులు అడ్డుకున్నారు. 

దివాన్ చెరువు వద్ద వ్యూహాత్మకంగా చంద్రబాబు కాన్వాయ్‌ని వదిలి ప్రైవేటు వాహనాలను అడ్డుపెట్టి ట్రాఫిక్ జామ్ చేశారు పోలీసులు . అలాగే చంద్రబాబును అనుసరిస్తున్న పార్టీ నేతల వాహనాలను దివాన్ చెరువు వద్దే నిలిపివేశారు. భారీకేడ్లను అడ్డుపెట్టి వాహనాలను నిలువరించడంతో పోలీసులపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso Read: 45 ఏళ్లలో ఏ తప్పు చేయలేదు, చేయబోను: రాజమండ్రి జైలు నుంచి బయటకి వచ్చాక బాబు

అంతకుముందు జైలు నుండి విడుదలైన తర్వాత టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. తాను కష్టకాలంలో ఉన్న సమయంలో తనకు  మీరందరూ మద్దతు తెలిపారన్నారు. తనకు మద్దతుగా  రోడ్డుపైకి వచ్చి సంఘీభావం తెలిపారన్నారు. అంతేకాదు తాను జైలు నుండి విడుదల కావడం కోసం ప్రత్యేక పూజలు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. తనపై ప్రజలు చూపిన అభిమానాన్ని తాను  ఏనాడూ మర్చిపోలేనని చంద్రబాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ, విదేశాల్లో కూడ తనకు సంఘీభావం తెలిపారన్నారు. తాను చేపట్టిన విధానాల వల్ల లబ్దిపొందినవారంతా మద్దతిచ్చారన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదని టీడీపీ చీఫ్ తేల్చి చెప్పారు. 

తప్పు చేయడాన్ని తాను ఏనాడూ కూడ సమర్ధించబోనని  చంద్రబాబు వివరించారు. తాను ఏనాడూ తప్పు చేయలేదు, చేయను, చేయబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు.హైద్రాబాద్ లో ఐటీ ఉద్యోగులు  సంఘీభావ ర్యాలీల గురించి చంద్రబాబు  ప్రస్తావించారు.తనకు సంఘీభావం ప్రకటించిన అన్ని పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను జైలులో ఉన్న  సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనకు  బహిరంగంగా మద్దతు ప్రకటించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 

అంతకుముందు చంద్రబాబు చర్య, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని.. అలాగే ఆయన కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు అభిమానులు, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu