అనుమతితోనే నిర్మాణం.. చంద్రబాబు నివాసం పై లింగమనేని రెస్పాన్స్

By telugu teamFirst Published Sep 21, 2019, 10:30 AM IST
Highlights

వారం రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్, ఫస్ట్ ఫ్లోర్ లోని డ్రెసింగ్ రూమ్.. నిబంధనలను విరుద్ధంగా నిర్మించారని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు.

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి సీఆర్డీఏ అధికారులు శనివారం ఉదయం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.గతంలో కూడా నోటీసులు జారీ చేయగా... ఈ రోజు మరోసారి జారీ చేశారు. వారం రోజుల్లో లింగమనేని నివాసాన్ని కూల్చి వేస్తామంటూ అధికారులు చెబుతున్నారు.  ఈ నోటీసులను కూడా అధికారులు లింగమనేని పేరు మీదే జారీ  చేశారు.

కాగా... ఈ నోటీసులపై తాజాగా లింగమనేని రమేష్ స్పందించారు. వారం రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్, ఫస్ట్ ఫ్లోర్ లోని డ్రెసింగ్ రూమ్.. నిబంధనలను విరుద్ధంగా నిర్మించారని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు.

అయితే.. తాను తన ఇంటిని నిర్మించుకునే సమయంలో అసలు సీఆర్డేఏ లేదని లింగమనేని చెప్పారు.  ఉండవల్లి పంచాయతీ అనుమతి తీసుకొని తాను ఇంటిని నిర్మించినట్లు లింగమనేని స్పష్టం చేశారు. స్విమ్మింగ్ పూల్ కి రివర్ కన్సర్వేటర్ అనుమతి ఉందని తెలిపారు.

కాగా... ఈ నివాసం అసలు యజమాని లింగమనేని కాగా.... దాంట్లో చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి అందులో అద్దెకు నివసిస్తున్నారు. ఇప్పటికే ఆ ఇంటికి సమీపంలోని ప్రజా వేధికను అక్రమ కట్టడం పేరిట వైసీపీ ప్రభుత్వం కూల్చివేసింది. ఇప్పుడు చంద్రబాబు నివసిస్తున్న ఈ ఇంటిని కూడా కూల్చేయాలని చూస్తోంది.  అయితే... తన నివాసం అక్రమ కట్టడం కాదని.. అనుమతి తోనే నిర్మించామంటున్న లింగమనేని వ్యాఖ్యలకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

read more news

చంద్రబాబు ఇంటికి మళ్లీ నోటీసులు.. కూల్చివేయడం ఖాయమా..?

click me!