జగన్ పై దాడి కేసులో ట్విస్ట్: జోగిరమేష్ కు నోటీసులు

By Nagaraju TFirst Published Nov 3, 2018, 4:37 PM IST
Highlights

వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తిదాడి ఘటనలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే  జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

గుంటూరు: వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తిదాడి ఘటనలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే  జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
 
జగన్ పై దాడిచేసింది టీడీపీ కార్యకర్తేనని జోగి రమేష్ ఆరోపించారు. శ్రీనివాస్ టీడీపీ కార్యకర్త అనడానికి తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటూ అతని సభ్యత్వ నమోదు కార్డును బహిర్గతం చేశారు. అయితే శ్రీనివాస్ టీడీపీ కార్యకర్త కాదని ఆ సభ్యత్వ నమోదు ఫేక్ అని టీడీపీ ఆరోపిస్తుంది. 

జోగి రమేష్ ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గుంటూరు జిల్లా ఆరండల్ పేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభవాలు దెబ్బతినేలా జోగిరమేష్ వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నాం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగిరమేష్ కు నోటీసులు అందజేశారు. ఈనెల 6న విచారణకు రావాలని ఆదేశించారు. జగన్ పై హత్యాయత్నం చేసింది టీడీపీ కార్యకర్తేనన్న వ్యాఖ్యలకు ఆధారాలు సమర్పించాలని నోటీసులో పొందుపరిచారు. 

పోలీసుల నోటీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జోగిరమేష్. విచారణను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారన్నారు. నోటీసులు ఒక రాజకీయ కుట్ర అన్నారు.   

click me!