విశాఖ ఆర్‌కే బీచ్ లో యువతి డెడ్ బాడీ కలకలం: దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Published : Apr 26, 2023, 10:26 AM IST
విశాఖ ఆర్‌కే బీచ్ లో  యువతి డెడ్ బాడీ కలకలం:  దర్యాప్తు  చేస్తున్న పోలీసులు

సారాంశం

విశాఖపట్టణం ఆర్‌కే బీచ్ లో  బుధవారంనాడు  యువతి మృతదేహం కలకలం  రేపుతుంది.   ఈ డెడ్ బాడీ పెదగంట్యాడకు  చెందిన శ్వేతగా  పోలీసులు గుర్తించారు.     


విశాఖపట్టణం: నగరంలోని  ఆర్ కే  బీచ్ లో   ఓ యువతి  డెడ్ బాడీ కలకలం  రేపుతుంది.  బుధవారంనాడు  ఉదయం బీచ్ లో  వాకింగ్  కు వచ్చిన  వాకర్స్ ఈ మృతదేహన్ని గుర్తించి  పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు ఈ డెడ్ బాడీని  పోస్టుమార్టం నిమిత్తం  కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. 

ఈ మృతదేహం  జిల్లాలోని పెదగంట్యాడకు  చెందిన  శ్వేతదిగా  పోలీసులు గుర్తించారు . శ్వేత  కన్పించడం లేదని కుటుంబ సభ్యులు ఇటీవలనే న్యూపోర్టు  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు  చేశారు.  అదృశ్యమైన  శ్వేత  కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ సమయంలోనే  శ్వేత  డెడ్ బాడీ  ఆర్ కే బీచ్ లో  ఇవాళ  కన్పించడం కలకలం రేపుతుంది.  శ్వేత  ఆత్మహత్య  చేసుకుందా, లేక ఎవరైనా హత్య చేశారా అనే విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.  యువతి  మృతదేహంపై బట్టలు లేని స్థితిలో ఉంది. మరో వైపు  మృతదేహం గుర్తుపట్టలేని  స్థితికి చేరుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్