ఆవనిగడ్డ కాలువలో కారు బోల్తా: కళ్లంవారిపాలెం వద్ద రత్నభాస్కర్ డెడ్‌బాడీ లభ్యం

Published : Jul 18, 2023, 03:19 PM ISTUpdated : Jul 18, 2023, 03:35 PM IST
ఆవనిగడ్డ కాలువలో కారు బోల్తా:  కళ్లంవారిపాలెం వద్ద  రత్నభాస్కర్ డెడ్‌బాడీ లభ్యం

సారాంశం

ఆవనిగడ్డ కాలువలో కారు పడిన ఘటనలో రత్న భాస్కర్  మృతి చెందాడు.  కాలువలో రత్నభాస్కర్ మృతదేహన్ని పోలీసులు గుర్తించారు.

విజయవాడ: ఆవనిగడ్డ కరకట్ట కాలువలో కారు పడిన ఘటనలో  రత్న భాస్కర్ మృతి చెందినట్టుగా  పోలీసులు గుర్తించారు.  కళ్లంవారిపాలెం దగ్గర కాలువలో లభ్యమైన మృతదేహన్ని  రత్నభాస్కర్ డెడ్ బాడీగా కుటుంబ సభ్యులు నిర్ధారించారు.  అయితే  రత్నభాస్కర్ మృతిపై  కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం  చేస్తున్నారు.

ఈ నెల  16వ తేదీన  రత్నభాస్కర్ కారు  ఆవనిగడ్డ  కాలువలో పడిపోయింది. అయితే  రత్నభాస్కర్  ఆచూకీ లభ్యం కాలేదు.  ఇంటికి వస్తున్నానని  కుటుంబ సభ్యులకు  సమాచారం ఇచ్చారు. కానీ  ఇంటికి రత్నభాస్కర్ రాలేదు. రత్నభాస్కర్ ఇంటి వెళ్లే సమయంలో ఆయన వద్ద రూ. 4 లక్షల నగదు కూడ ఉందని  ఆయన  బావ మరిది మీడియాకు  చెప్పారు.

రత్నభాస్కర్ మృతదేహంపై  ఎలాంటి దుస్తులు లేకపోవడంపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రత్నభాస్కర్ ను  హత్యచేసి ఉంటారని  అనుమానిస్తున్నారు.  రత్నభాస్కర్ తాను  ఉన్న ప్రాంతం గురించి లోకేషన్ ను  షేర్ చేసినట్టుగా  చెబుతున్నారు. అయితే రత్నభాస్కర్ తన లోకేష్ ను ఎందుకు  షేర్ చేశారనే విషయమై చర్చ సాగుతుంది. రత్నభాస్కర్ కాలువలో పడి మృతి చెందాడా, లేకపోతే  ఎవరైనా రత్నభాస్కర్ ను హత్యచేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

 


 


 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్