గుంటూరు జిల్లాలో అశ్లీల వీడియోల కలకలం: వీడియోలు వైరల్

Published : Jul 12, 2020, 12:20 PM IST
గుంటూరు జిల్లాలో అశ్లీల వీడియోల కలకలం: వీడియోలు వైరల్

సారాంశం

గుంటూరు జిల్లా నిజాంపట్టణం మండలం అడవులదీవిలో ఓ మహిళ అశ్లీల వీడియోలను ప్రైవేట్ టీచర్ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. ఈ  వీడియోలు స్థానికంగా ఉన్న యువత షేర్ చేసుకొన్నారు.


గుంటూరు: గుంటూరు జిల్లా నిజాంపట్టణం మండలం అడవులదీవిలో ఓ మహిళ అశ్లీల వీడియోలను ప్రైవేట్ టీచర్ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. ఈ  వీడియోలు స్థానికంగా ఉన్న యువత షేర్ చేసుకొన్నారు.

ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.దీంతో పోలీసులు వాట్సాప్ గ్రూప్ ఆడ్మిన్ ను పిలిపించారు. అయితే ఈ గ్రూపులో ప్రైవేట్ టీచర్ గుడారయ్య ఈ వీడియోలను పోస్టు చేసినట్టుగా ఆడ్మిన్ తెలిపారు. 

స్థానికంగా ఉన్న మహిళకు చెందిన వీడియోలుగా  ప్రచారం చేశారు. గ్రూప్ అడ్మిన్ ఫిర్యాదు మేరకు  ప్రైవేట్ టీచర్ గుడారయ్యపై  ఫిర్యాదు చేశాడు. 
గ్రూప్ ఆడ్మిన్ పై కూడ పోలీసులు కేసు  నమోదు చేశారు. 

యువతిపై కక్షతోనే ఈ వీడియోలను పోస్టు చేశారనే ప్రచారం సాగుతోంది. ఈ వీడియోలు గ్రామంలోని గొడవలకు దారితీస్తాయనే గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.ఈ విషయమై పోలీసులు రంగప్రవేశం చేసి ఈ వీడియోల గురించి ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

School Holidays: ఏపీకి భారీ వర్షాల హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
పల్నాడు జిల్లాలో వరద బీభత్సం జలమయమైన జాతీయ రహదారి| Palnadu District | Heavy Rains Traffic Disruption