ఎమ్మెల్యే రోజా వాహనంపై దాడి.. 30మందిపై కేసు

Published : Jan 07, 2020, 07:53 AM ISTUpdated : Jan 07, 2020, 07:54 AM IST
ఎమ్మెల్యే రోజా వాహనంపై దాడి.. 30మందిపై కేసు

సారాంశం

పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే రోజా జనవరి 5న నగరి నియోజవర్గంలోని పుత్తూరు మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పురం గ్రామంలోకి ప్రవేశించకుండా..ఒక వర్గం వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు.

ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా పై  ఇటీవల దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటనపై రోజా చాలా సీరియస్ గా ఉన్నారు. తమ పార్టీ కార్యకర్తలపైనే పుత్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేబీఆర్‌పురంలో గ్రామ సచివాలయ భూమిపూజకు వెళ్లిన సమయంలో సురేష్, రిషేంద్ర, హరీష్, సంపత్,  అంబు, సరళ, రామ్మూర్తి తనపై దాడికి యత్నించారని రోజా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 143,341,427,506, 509 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద పుత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

మొత్తం 30మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. కాగా ఎమ్మెల్యే రోజా కారును అడ్డుకోవడాన్ని వైసీపీ దళిత విభాగం నాయకులు ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కొంతమంది స్వార్థపరుల ప్రోద్బలంతో ఇదంతా జరిగిందన్న వారు వారి ఉచ్చులో పడవద్దని సాటి దళితులుగా కోరుతున్నామని తెలిపారు.

పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే రోజా జనవరి 5న నగరి నియోజవర్గంలోని పుత్తూరు మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పురం గ్రామంలోకి ప్రవేశించకుండా..ఒక వర్గం వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. 

AlsoRead ఇప్పుడు గుర్తొచ్చామా, నగరిలోకి రావొద్దు: రోజాకు చేదు అనుభవం...

సుమారు 20 నిమిషాల పాటు ఆమె కారును నిలిపిన వైసీపీ కార్యకర్తలు.. రోజా సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వినలేదు. అంతేకాకుండా పెద్ద ఎత్తున రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు.

కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆందోళలనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా తమ పార్టీకి చెందిన అమ్ములు వర్గమే దాడి చేయించిందని ఆరోపించిన రోజా.. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇక పార్టీ కార్యకర్తలకు రోజా ప్రాధాన్యం ఇవ్వడం లేదని అమ్ములు వర్గం ఆరోపణలు చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు | Asianet News Telugu
Pawan Kalyan: కాకినాడలో ‘మన ఊరు - మాట మంతి’ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu