టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్.. ఏలూరు ప్రభుత్వాస్పత్రి నుంచి పోలీసు స్టేషన్‌కు తరలింపు..

By Sumanth KanukulaFirst Published Jan 2, 2023, 12:28 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. వివరాలు.. కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ కాపు రిజర్వేషన్ల కోసం నేటి నుంచి నిరవధిక నిరహార దీక్ష చేయనున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు హరిరామజోగయ్యను ఆదివారం అర్దరాత్రి పాలకొల్లులోని ఆయన నివాసం నుంచి బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే హరిరామజోగయ్య ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దీక్ష చేపట్టారు.

ఈ క్రమంలోనే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పలు విపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక, ఆస్పత్రికి వచ్చిన చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు లోనికి వెళ్లేందుకు అనమతించలేదు. అనారోగ్యంతో ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్‌ను పరామర్శించేందుకు తాను వచ్చానని చింతమనేని చెప్పారు. అయినప్పటికీ చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు లోనికి వెళ్లేందుకు అనమతించలేదు. ఈ క్రమంలోనే చింతమనేని పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

ఇదిలా ఉంటే.. కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్‌లో మాట్లాడారు. అలాగే వైద్యులతో మాట్లాడి హరిరామ జోగయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హరిరామ జోగయ్య దీక్షపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం హరిరామ జోగయ్య 85 ఏళ్ల వయసులో అమరణ దీక్ష చేపట్టారని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి చర్చలు జరపాలని కోరారు. 

click me!