
అనకాపల్లి జిల్లా (anakapalle district) నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌పై (constable) సస్పెన్షన్ (suspension) వేటు పడింది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై (ys jagan mohan reddy) అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోలీస్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసినందుకు నవీన్ కుమార్ శెట్టి అనే కానిస్టేబుల్‌పై అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమిసాలి సస్పెండ్ చేశారు. అచ్యుతాపురం బ్రాండిక్స్‌లో అమ్మోనియా విషవాయువుల ప్రభావంతో (anakapalle gas leak) అస్వస్థతకు గురైన అంశానికి సంబంధించిన పోస్టు చివరిలో సీఎం జగన్‌ను కించపరిచేలా క్యాప్షన్ పెట్టి పోలీస్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసినట్లు నవీన్ కుమార్‌పై ఆరోపణలు వచ్చాయి.
Also Read:అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విషవాయువు కలకలం.. పరుగులు తీసిన సెక్యూరిటీ సిబ్బంది
దీనిపై ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారితో విచారణకు అనకాపల్లి ఎస్పీ గౌతమిసాలి ఆదేశించారు. అయితే.. ఏపీ ప్రభుత్వంపై కానీ.. సీఎం జగన్‌పై కానీ కించపరిచే విధంగా పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం నవీన్ కుమార్ వ్యవహారంపై ఏపీ పోలీస్ శాఖలో పెద్ద చర్చ జరుగుతోంది.