మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడితో కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ భేటీ అయ్యారు. ఈ భేటీకి రాజకీయ ఉద్దేశం లేదని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. వైసీపీ నుండి బహిష్కరణకు గురైన మాజీ మంత్రితో ముద్రగడ భేటీ కావడం రాజకీయపరంగా చర్చకు దారి తీసింది.
అమరావతి: మాజీ మంత్రి Kothapalli Subbarayuduతో Kapu రిజర్వేషన్ల ఉద్యమ నేత Mudragada Padmanabham ఆదివారం నాడు భేటీ అయ్యారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిపై వైసీపీ ఇటీవలనే suspension వేటు వేసింది.ఈ సస్పెన్షన్ పై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా YCPనాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలో మాజీ మంత్రి సుబ్బారాయుడితో కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పలు అంశాలపై సుమారు గంట పాటు ఇద్దరు నేతలు చర్చించారు. ఈ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశం ఏమీ లేదని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు రాజకీయంగా ఎదగడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనే పలు దఫాలు ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే కాపులు ఏర్పాటు చేసే రాజకీయ వేదికలో బీసీలు, దళితులను కూడా కలుపుకోని పోవాల్సిన అవసరం ఉందని గతంలోనే ముద్రగడ పద్మనాభం అభిప్రాయపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో తాను ఎన్నికల బరిలో నిలుస్తానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాననే విషయమై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఈ తరుణంలో ముద్రగడ పద్మనాభం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2014 ఎన్నికల్లో వైసీపీలో ఉన్న కొత్త పల్లి సుబ్బారాయుడు ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీకి గుడ్ బై చెప్పారు. తిరిగి ఆయన వైసీపీలో చేరారు.
వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం కూడా కీలక పాత్ర పోషించేందుకు ప్లాన్ చేస్తుంది.ఈ మేరకు రాజకీయ వేదిక ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇతర సామాజిక వర్గాల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పొత్తులు ఉండే అవకాశం కూడా లేకపోలేదనే చర్చ కూడా కొనసాగుతుంది. ఈ సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.