పెళ్లి చేసుకుంటానని సచివాలయంలో పనిచేసే యువతికి శారీరకంగా దగ్గరైన కానిస్టేబుల్.. కానీ చివరకు..

By Sumanth KanukulaFirst Published Jan 4, 2022, 3:34 PM IST
Highlights

ప్రజలకు రక్షణ ఉండాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ (police constable).. పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేశాడు. వార్డు సచివాలయంలో పనిచేస్తున్న యువతితో పరిచయం పెంచుకుని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరచ్చుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో (visakhapatnam) చోటుచేసుకుంది. 

ప్రజలకు రక్షణ ఉండాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ (police constable).. పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేశాడు. వార్డు సచివాలయంలో పనిచేస్తున్న యువతితో పరిచయం పెంచుకుని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరచ్చుకున్నాడు. అయితే యువతి గర్భం దాల్చడంతో.. గర్భ స్రావం చేయించాడు. యువతి పెళ్లి చేసుకోవాలని కోరగా.. ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో (visakhapatnam) చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. బాధిత యువతి (29) నగరంలో వార్డు సచివాలయ కార్యదర్శిగా పని చేస్తుంది. ఆమెకు మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నిమ్మకాయల నరేష్‌తో 2021 ఫిబ్రవరి నెలలో పరిచయం ఏర్పడింది. 

ఆ తర్వాత ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. వాట్సాప్‌లో చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగింది.  యువతిని ఇష్టపడుతున్నానని చెప్పిన కానిస్టేబుల్ నరేష్.. పెళ్లి చేసుకుంటానని కూడా తెలిపాడు. ఇందుకు ఆమె కూడా ఒకే చెప్పింది. ఈ పరిచయంతోనే కానిస్టేబుల్ వద్ద తన ల్యాప్‌టాప్ ఉంచి డబ్బులు తీసుకుంది. ఆ తర్వాత అవి చెల్లించడానికి నరేష్ ఉంటున్న పోలీస్ క్వార్టర్స్‌కు వెళ్లింది. అక్కడ నరేష్ ఆమెను శారీరకంగా లోబరుచుకున్నారు. 

అనంతరం పలుమార్లు రుషికొండ, పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి శారీరకంగా దగ్గరయ్యాడు. పలుమార్లు నరేష్‌కు లైంగికంగా దగ్గర కావడంతో యువతి గర్భం దాల్చింది. అయితే ఈ విషయాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించిన నరేష్.. ఆమెకు మాత్రలు ఇచ్చి గర్భస్రావం అయ్యేలా చేశారు. ఇక, యువతి తనను పెళ్లి చేసుకోమని అడగటంతో.. నరేష్ మోహం చాటేశాడు. 

నరేష్ పెళ్లికి నిరాకరించడంతో యువతి తనకు జరిగిన అన్యాయంపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఫిర్యాదులో పేర్కొంది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

click me!