హెరిటేజ్ వాహనాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్

Published : Jul 04, 2017, 03:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
హెరిటేజ్ వాహనాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్

సారాంశం

ఎప్పటి నుండో హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అవుతున్న విషయం అర్ధమైపోతోంది. దాదాపు కోటి రూపాయలు విలువైన దుంగలను పోలీసులు స్వధీనం చేసుకున్నారు. వాహనానికి రెండు నెంబర్ ప్లేట్లున్న విషయాన్ని కూడా గమనించారు. ఒకటేమో ఏపి రిజిస్ట్రేషన్ కాగా రెండో నెంబరేమో తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉండటం గమనార్హం.

హెరిటేజ్ వాహనాల్లో ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ అవ్వటం సంచలనంగా మారింది. హెరిటేజ్ అంటే ఎవరిదో అందరికీ తెలిసిందే కదా? తిరుపతికి సమీపంలోని కరకంబాడి రోడ్డులో సుమారు కోటి రూపాయల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఉదయం పోలీసులు సోదాలు చేస్తున్నారు. అదే సమయంలో కొందరు గుర్తు తెలీని వ్యక్తులు పోలీసులపైకి కాల్సలు జరిపారు. దాంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

పోలీసులు మామూలు సోదాలు చేస్తుంటే ఎవరో ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో పోలీసులకు అర్ధం కాలేదు. తీరా చూస్తే కాల్పులు ఒక వాహనం పక్క నుండి వచ్చినట్లు గుర్తించారు. వాహనం ఎవరిదా అని పోలీసులు ఆరాతీస్తే హెరిటేజ్ వాహనమని తెలిసింది. దాంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. అయితే, పోలీసులు కూడా ఫైరింగ్ కు దిగేటప్పటికి మొదట కాల్పులు జరిపిన వారు పారిపోయారు. చివరకు పోలీసులు వాహనాన్ని స్వధీనం చేసుకున్నారు.

వాహనాన్ని తెరిచిచూసిన పోలీసులు అవక్కాయ్యారు. ఎందుకంటే, అందులో ఎర్రచందనం దుంగులున్నాయి. ఎక్కడి నుండి ఎక్కడికి ఎర్రచందనాన్ని తీసుకెళుతున్నదీ తెలీలేదు. అంటే ఎప్పటి నుండో హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అవుతున్న విషయం అర్ధమైపోతోంది. దాదాపు కోటి రూపాయలు విలువైన దుంగలను పోలీసులు స్వధీనం చేసుకున్నారు. వాహనానికి రెండు నెంబర్ ప్లేట్లున్న విషయాన్ని కూడా గమనించారు. ఒకటేమో ఏపి రిజిస్ట్రేషన్ కాగా రెండో నెంబరేమో తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉండటం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే