టిడిపి మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులుపై కేసు నమోదు

By Arun Kumar PFirst Published Nov 23, 2021, 8:00 AM IST
Highlights

గుంటూరు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులుపై శ్యావల్యాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. 

వినుకొండ: తెలుగుదేశం పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యేపై పోలీస్ కేసు నమోదయ్యింది. ఎన్నికల నిబంధనలను అతిక్రమించారంటూ వినుకొండ మాజీ ఎమ్మెల్యే. నరసాపురం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు జివి ఆంజనేయులుతో పాటు మరికొందరు టిడిపి నాయకులపై శావల్యాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.   

ఇటీవల ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతో మనస్తాపానికి గురయిన టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు మీడియా ఎదుటే బోరున విలపించిన విషయం తెలిసిందే. ఇలా తమ నాయకుడి భార్య భువనేశ్వరిపై నిండుసభలో అనుచిత వ్యాఖ్యలు చేసి చంద్రబాబును అవమానించిన  వైసిపి నాయకులపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ap assembly లో YSRCP సభ్యుల వ్యవహార తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలోనే Vinukonda నియోజకవర్గ పరిధిలోని శావల్యాపురంలో మాజీ ఎమ్మెల్యే gv anjaneyulu ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రోడ్డుపైకి భారీగా చేరుకున్న టిడిపి శ్రేణులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేసారు.   

read more  three capitals bill: జగన్ తీరుతో రాష్ట్ర ఆదాయానికి గండి... ఇకపై ప్రజాక్షేత్రంలోనే: చంద్రబాబు వ్యాఖ్యలు

ఈ ఆందోళన ద్వారా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించి ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించారంటూ టిడిపి శ్రేణులపై కేసు నమోదయ్యింది. అలాగే ఎన్నికల నిబంధనలను కూడా  అతిక్రమించారంటూ మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులుతో పాటు పలువురు టిడిపి నాయకులపై కేసు నమోదు చేసారు. 

ఇదిలావుంటే రెండురోజుల క్రితమే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శ్రీకాకుళం జిల్లా టిడిపి అధ్యక్షులు కూన రవికుమార్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. srikakulam పట్టణంలోని శాంతినగర్ కాలనీలో సోదరుడి ఇంట్లో వుండగా అర్దరాత్రి సమయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసారు.   

గతంలో పోలీసులను దూషించిన కేసులో kuna ravikumar ను పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్ట్ తర్వాత ఆయనను పోలీసులు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ చేసే సమయంలో కుటుంబసభ్యులను పోలీసులు భయబ్రాంతులకు గురిచేసారని... అర్ధరాత్రి ఇంట్లోకి దూరి అరెస్ట్ చేయడం దారుణమని కూన సోదరుడు ఆందోళన వ్యక్తం చేసారు. 

కూన రవికుమార్ పై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. పలుమార్లు ఆయన అరెస్టవగా మరికొన్నిసార్లు ముందస్తు బెయిల్ పొంది అరెస్ట్ నుండి తప్పించుకున్నారు. అయితే ఇటీవల మరోసారి ఆయన అరెస్టవడం శ్రీకాకుళం టిడిపిలో అలజడి రేపింది.  

click me!