విజయవాడలో టీడీపీ కార్పొరేటర్‌ దుర్గ కొడుకు అరెస్ట్..

Published : Aug 17, 2022, 05:17 PM IST
విజయవాడలో టీడీపీ కార్పొరేటర్‌ దుర్గ కొడుకు అరెస్ట్..

సారాంశం

విజయవాడలో టీడీపీ కార్పొరేటర్‌ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇచ్చిన అప్పుకు అధిక వడ్డీ వసూలు చేయడంతో పాటుగా, తన భార్యను వేధిస్తున్నాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

విజయవాడలో టీడీపీ కార్పొరేటర్‌ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇచ్చిన అప్పుకు అధిక వడ్డీ వసూలు చేయడంతో పాటుగా, తన భార్యను వేధిస్తున్నాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. వివరాలు.. విజయవాడ 61వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్‌ దుర్గ కొడుకు దనశేఖర్‌ వద్ద తాను రూ. 50 వేలు అప్పుగా తీసుకున్నానని ఫణికుమార్ అనే వ్యక్తి చెప్పాడు. అయితే ఇప్పటివరకు రూ. 2 లక్షలు వసూలు చేశాడని తెలిపారు. తన భార్యను కూడా ధనశేఖర్ వేధించాడని ఆరోపించాడు. 

ఈ మేరకు ఫణికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ధనశేఖర్‌పై 386, 509, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం