లోకేష్‌కు బ్రహ్మణితో ఏదైనా గొడవ ఉంటే ఇంట్లో తేల్చుకోవాలి.. : మంత్రి గుడివాడ అమర్‌నాథ్

Published : Aug 17, 2022, 11:21 AM IST
లోకేష్‌కు బ్రహ్మణితో ఏదైనా గొడవ ఉంటే ఇంట్లో తేల్చుకోవాలి.. :  మంత్రి గుడివాడ  అమర్‌నాథ్

సారాంశం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. లోకేష్‌కు, ఆయన భార్య బ్రహ్మణికి మధ్య ఏవైనా గొడవలు ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలని తేల్చుకోవాలని అన్నారు. బ్రహ్మణిని తిట్టలేక తమతో తిట్టించాలనే తాపత్రయం లోకేష్‌లో కనిపించిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతిని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. వైఎస్ భారతి రాజకీయాల్లో ఏ రోజైన బయట కనబడ్డారా అని ప్రశ్నించారు. ఏ రోజైనా రాజకీయంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నలు సంధించారు. 

అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జనసేనపై కాపుల పార్టీ అని ముద్రవేస్తున్నారని అన్నారని.. అయితే అది కాపు జనసేన కాదని అన్నారు. పవన్ కల్యాణ్‌ నడుపుతుంది కాపు జనసేన కాదని.. కమ్మ జనసేన అని విమర్శించారు. అక్కడ డైరెక్షన్‌ చేస్తుంది నాదెండ్ల మనోహర్ అని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
🤣😂 YS Jagan గులకరాయి డ్రామా | Nara Lokesh Hilarious Speech On YS Jagan | Asianet News Telugu