మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్, టీడీపీ శ్రేణుల ఆందోళన.. మచిలీపట్నంలో ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Feb 06, 2023, 09:02 PM IST
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్, టీడీపీ శ్రేణుల ఆందోళన.. మచిలీపట్నంలో ఉద్రిక్తత

సారాంశం

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేయడంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించాయి. 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ప్రదర్శనలో కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికార వైసీపీకి ఎలా కేటాయిస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ క్రమంలో సదరు ప్రభుత్వ భూమిని కొల్లు రవీంద్ర మీడియా ప్రతినిధులకు చూపేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కొల్లు రవీంద్ర సహా పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి గూడూరు పీఎస్‌కు తరలించారు. దీంతో నగరంలో ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోడ్డుపైనే బైఠాయించాయి. దీంతో లక్ష్మీ టాకిస్ సెంటర్‌లో ట్రాఫిక్ నిలిచిపోయింది. 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్