తేనె పేరుతో బంగారానికి గాలం.. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ మోసం...

By AN TeluguFirst Published Feb 6, 2021, 11:09 AM IST
Highlights

కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో పూజల పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు కిలాడీ లేడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు తేనె అమ్ముతున్నట్టు నటిస్తూ ఊర్లో రెక్కీ చేసి ఒంటరి మహిళలను గుర్తిస్తారు. ఆ తరువాత మరో మహిళ పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుందంటూ నమ్మిస్తుంది. ఇద్దరూ కలిసి ఇంట్లో బంగారం తీసుకుని ఉడాయిస్తారు.

శుక్రవారం కొలిమిగుండ్ల లో  ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళా దొంగల్లో ఒక రు ఊర్లో తేనె అమ్ముతున్నట్లు నటిస్తూ రెక్కీ నిర్వహించింది. ఇలాగే ఈ పెద్దమ్మ ఆలయం సమీపంలోని వీధిలో ఉండే శ్రావణి ఇంట్లోకి చిత్తూరు లక్ష్మి అనే మహిళా దొంగ వెళ్లింది. పూజలు చేస్తే నీ భర్త ఆరోగ్యం బాగుపడుతుందని తెలిపింది. 

ఈ పూజకోసమే అంటూ మరో మహిళ కూడా ఇంట్లోకి చేరింది. వాళ్ల మాటలు నమ్మిన శ్రావణి పూజకు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టింది. అయితే పూజలో బంగారం కూడా పెట్టాలని చెప్పడంతో నమ్మి బంగారం కూడా అక్కడ పెట్టింది. 

కాసేపటికి ఏవో మాయమాటలు చెప్పి ఆమె దృష్టి మళ్లించారు. బంగారం స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలు పెట్టి అసలు నగలను బ్యాగ్ లో వేసుకుంది. ఇక వచ్చిన పని అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేసింది. 

కిలాడీ లేడి ఇంకో చోట పూజ చేయాల్సి ఉందని, ఆ పూజ చేసి వెంటనే ఇక్కడికి వస్తానని చెప్పి ఇంటినుంచి బయపటింది. మెయిన్ రోడ్డు మీదికి వచ్చి ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. అయితే అతను కానిస్టేబుల్ సుబ్బరాయుడు.. అతను మఫ్టీలో ఉండడంతో అతని బైక్‌ ఎక్కింది. 

ఇంతలో ఈ మోసం తెలుసుకున్న శ్రావణి గగ్గోలు పెట్టడంతో పక్కింట్లో ఉండే మహిళ ఆమె బంగారం తీసుకెళుతోందని  కేకలు వేసింది. దీంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్‌ బైక్‌ను వెనక్కి తిప్పి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెల్దుండగా ఏటీఎం దగ్గరికి రాగానే నిందితురాలు కిందికి దూకే  ప్రయత్నం చేసింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. 

click me!