నెల్లూరు జిల్లాలో యువతిపై దాడి:పోలీసుల అదుపులో ఇద్దరు

Published : Sep 15, 2021, 12:44 PM IST
నెల్లూరు జిల్లాలో యువతిపై దాడి:పోలీసుల అదుపులో ఇద్దరు

సారాంశం

నెల్లూరు జిల్లా రామకోటినగర్ లో యువతిపై కర్రతో విచక్షణరహితంగా దాడి చేసిన వ్యక్తి వెంకటేష్ తో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లా రామకోటి నగర్ లో యువతిపై దాడి చేసిన ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకొన్నారు. యువతిపై కర్రతో విచక్షణ రహితంగా దాడి చేసిన నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరొకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

also read:నన్ను కొట్టొద్దంటూ యువతి వేడుకోలు: నెల్లూరులో యువతిపై వ్యక్తి కర్రతో దాడి

నెల్లూరు జిల్లా రామకోటినగర్ లో ఓ యువతిపై  ఓ వ్యక్తి దారుణంగా కర్రతో దాడి చేశాడు. తనను కొట్టొద్దని ఆ యువతి వేడుకొంటున్న వినకుండా కర్రతో విపరీతంగా కొట్టాడు.ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.యువతిని కొట్టిన వ్యక్తిని వెంకటేష్ గా ఈ దృశ్యాలను రికార్డు చేసింది శివగా పోలీసులు గుర్తించారు. తొలుత శివను పోలీసులు అదుపులోకి విచారించారు. శివ ఇచ్చిన సమాచారం మేరకు వెంకటేష్ ను కూడ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. యువతిని వెంకటేష్ ఎందుకు కొట్టారనే విషయమై పోలీసులు  ప్రశ్నిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త