తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

Published : Oct 04, 2023, 08:32 AM ISTUpdated : Oct 04, 2023, 08:55 AM IST
తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

సారాంశం

గత నెలలో టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును చోరీ చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. తిరుమల బస్టాండ్ సమీపంలో అతడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించారు.

తిరుమల వేంకటేశ్వర స్వామి క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఫ్రీగా నడిపించే ఎలక్ట్రిక్ బస్సు గత నెల 24వ తేదీన చోరీకి గురయ్యింది. కానీ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టడంతో అదే రోజు లభ్యం అయ్యింది. అయితే ఈ చోరీకి పాల్పడిన నిందితుడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. అతడిని రిమాండ్ కు తరలించారు.

విషాదం.. ఊయల తాడు మెడకు చుట్టుకొని పదేళ్ల బాలుడు మృతి

దీనికి సంబంధించిన వివరాలను ఏఎస్పీ విమలకుమారి మంగళవారం వన్ టౌన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. నిందితుడు నీలావత్ విష్ణు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కు చెందిన వాడు. అతడి తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందట మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు జీవనోపాధి కోసం వచ్చారు. అయితే విష్ణు తండ్రి.. తల్లిని 2015లో హత్య చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

సహజీవనం చేసిన యువకుడిపై మహిళ యాసిడ్ దాడి.. గుంటూరులో ఘటన.. ఏం జరిగిందంటే ?

తండ్రి జైలుకు వెళ్లడంతో చిన్నప్పుడే విష్ణు, అతడి సోదరి అనాథలయ్యారు. స్థానిక పోలీసులు స్పందించి వారిని సైదాబాద్‌ గవర్నమెంట్ బాలల సంరక్షణ కేంద్రంలో జాయిన్ చేశారు. ఈ క్రమంలో 2020 సంవత్సరంలో విష్ణు టెన్త్ క్లాస్ పూర్తి చేశాడు. అనంతరం చేతివృత్తులు నేర్పించే కేంద్రంలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే అదే సమయంలో అక్కడున్న సైకిల్ ను దొంగతనం చేసి పరారయ్యాడు.

Bandi Sanjay: "ప్రధాని ప్రకటనలతో బీఆర్ఎస్ నేతలకు పిచ్చెక్కుతోంది"

ఇక అప్పటి నుంచి దొంగతనాన్నే వృత్తిగా మార్చుకున్నాడు. కొంత కాలం కిందట తిరుమలకు వచ్చాడు. టీడీడీ నిర్వహించే ఉచిత బస్సుల్లో అటూ, ఇటూ తిరిగేవాడు. సిబ్బందితో పరిచయం పెంచుకొని వారితో నమ్మకంగా ఉన్నాడు. ఈ క్రమంలో గత నెల 24వ తేదీన టీడీపీ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసు ఎదుట ఉంచిన కోటీ 44 లక్షల రూపాయిల విలువైన ఉచిత బస్సును దొంగతనం చేసి, ఎత్తుకెళ్లాడు. పోలీసుల గాలిస్తున్నారని భయపడి ఆ బస్సును ఆదే రోజు నాయుడుపేట - చెన్నై రోడ్డుపై వదిలేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సోమవారం తిరుపతి బస్టాండ్ దగ్గర నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu