తిరుపతి ఎంపీ గురుమూర్తికి లోన్ల పేరుతో ఫోన్: రూ. 37 లక్షల డిమాండ్ చేసిన అభిషేక్ అరెస్ట్

Published : Jan 15, 2022, 05:40 PM ISTUpdated : Jan 15, 2022, 07:04 PM IST
తిరుపతి ఎంపీ గురుమూర్తికి లోన్ల పేరుతో ఫోన్: రూ. 37 లక్షల డిమాండ్ చేసిన అభిషేక్ అరెస్ట్

సారాంశం

తిరుపతి ఎంపీకి రూ.37.5 లక్షలు ఇస్తేనే రుణాలు విడుదల చేస్తామని ఫోన్ చేసిన అభిషేక్ అనే వ్యక్తిని తిరుపతి పోలీసులు హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు. ఖాదీ పరిశ్రమ లోన్లు రావాలంటే రూ. 37.5 లక్షలు ఇవ్వాలని ఆయన కోరారు.

తిరుపతి: Tirupati MP  గురుమూర్తికి రుణాలు ఇప్పిస్తామని ఫోన్ చేసిన అభిషేక్ అనే యువకుడిని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.తిరుపతి ఎంపీ డాక్టర్  Gurumurthyకి Abhishek అనే వ్యక్తి Cmo నుండి ఫోన్ చేస్తున్నట్టుగా పోన్ చేశాడు. Khadi పరిశ్రమ సబ్సిడీ రుణాలను  మంజూరయ్యాయని చెప్పారు.  తిరుపతి ఎంపీ నియోజకవర్గానికి రూ. 5 కోట్లు మంజూరైనట్టుగా చెప్పారు. ఈ నిధులు విడుదల కావాలంటే తాను సూచించిన Bank  ఖాతాలో రూ.1.5 లక్షలు చెల్లించాలని కోరాడు. ఈ నియోజకవర్గంలోని 25 ధరఖాస్తులకు గాను ఒక్కొక్క ధరఖాస్తుకు రూ.1.5 లక్షలు చెల్లించాలని కోరాడు. తాను సూచించిన బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ చేస్తేనే రుణాలు విడుదల అవుతాయని అభిషేక్ చెప్పాడు.

అయితే ఈ విషయమై అనుమానం వచ్చిన ఎంపీ గురుమూర్తి  సీఎంఓ అధికారులతో ఈ విషయమై ఆరా తీశారు. అయితే సీఎంఓలో అభిషేక్ అనే వ్యక్తి ఎవరూ కూడ లేరని సీఎంఓ సమాచారం ఇచ్చింది. దీంతో ఎంపీ గురుమూర్తి తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అభిషేక్ ఇచ్చిన సమాచారాన్ని కూడా పోలీసులకు అందించారు.అభిషేక్ పంపిన సమాచారం ఆధారంగా తిరుపతి పోలీసులు Hyderabad లో ఉన్న అభిషేక్ ను అరెస్ట్ చేశారు.

గతంలో కూడా Andhra pradesh, Telangana రాష్ట్రాల్లో కూడా ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు డిమాండ్ చేసిన కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు డిమాండ్ చేసిన కేసులో  నిందితులను పోలీసులు arrest చేశారు.

కరోనా సమయంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. దేశ వ్యాప్తంగా ఈ నేరాల సంఖ్య పెరిగింది. కరోనా లాక్ డౌన్ సమయంలో నేరగాళ్లు ఇంటర్నెట్ వేదికగా అమాయకులను మోసం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాల సంఖ్య గతంలో కంటే ఎక్కువగా నమోదైనట్టుగా పోలీసులు చెబుతున్నారు. సైబర్ క్రైమ్ విషయమై ప్రజలను ప్రజలు అప్రమత్తం చేస్తున్నా కూడా ప్రజలు పోలీసుల సూచనలను పాటించని కారణంగా సైబర్ క్రైమ్ కేసులు పెరిగిపోతన్నాయి.

PREV
click me!

Recommended Stories

CM Nara Chandrababu Naidu: మహిళా సంఘాలకు చెక్కులను అందజేసిన సీఎం చంద్రబాబు| Asianet News Telugu
CM Chandrababu In Saras Mela At Guntur: ఈ మహిళా స్పీచ్ కి సీఎం చంద్రబాబు లేచి మరీ | Asianet Telugu