జగన్ కేసులో కీలక మలుపు... విచారణ నుండి తప్పుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

Arun Kumar P   | Asianet News
Published : Nov 16, 2020, 01:15 PM ISTUpdated : Nov 16, 2020, 01:46 PM IST
జగన్ కేసులో కీలక మలుపు... విచారణ నుండి తప్పుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

సారాంశం

ముఖ్యమంత్రి జగన్ చర్యలను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ లలిత్ కుమార్ నేతృత్వంలోనే ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.  

న్యూడిల్లీ: న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజెఐ)కి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ లేఖను సీఎం జగన్ మీడియాకు విడుదల చేయడంపై వివాదం చెలరేగుతోంది. ముఖ్యమంత్రి చర్యలను వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టాల్సి వుండగా జస్టిస్ లలిత్ కుమార్ నేతృత్వంలోనే ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.  

గతంలో ఈ పిటిషన్లతో సంబంధమున్న వారి తరపున తాను వాదించానని...  అందువల్ల ఈ వ్యవహారంపై తాను విచారణ జరపడం సరికాదని బావిస్తున్నట్లు జస్టిస్ లలిత్ కుమార్ వెల్లడించారు. అందువల్ల ఈ పిటిషన్లపై తాను విచారణ చేపట్టలేనని... వేరే ధర్మాసనానికి దీన్ని బదిలీ చేయాలని సిజెఐ ను కోరినట్లు తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధి ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని న్యాయమూర్తి లలిత్ కుమార్ వెల్లడించారు. 

read more  సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణపై సీజేఐకి జగన్ లేఖ: ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సీరియస్

ఇప్పటికే సీజెఐ కి ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖ కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ లేఖపై ఆయన స్పందించారు. జగన్ మీద కోర్టు ధిక్కారం కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గతంలో అశ్వినీ ఉఫాధ్యాయ వేణుగోపాల్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. 

ఆ లేఖపై కేకే వేణుగోపాల్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఇటీవలే అశ్వినీ ఉపాధ్యాయకు లేఖ రాశారు. సీజేఐకి జగన్ రాసిన లేఖ కచ్చితంగా కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని వేణుగోపాల్ అన్నారు. సీజేఐకి రాసిన లేఖను బహిర్గతం చేయడం కోర్టు దిక్కారం కిందికే వస్తుందని ఆయన అన్నారు. 

 ప్రజాప్రతినిధులకు సంబంధించి జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు తర్వాత జగన్ ఆ లేఖ రాయడం, దాన్ని బహిర్గతం చేసిన సందర్భం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. అన్ని విషయాలూ సీజేఐకి తెలుసునని, ప్రత్యేకంగా కోర్టు ధిక్కారం కోసం అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 

ఇప్పటికే జగన్ మీద 31 కేసులు ఉన్న విషయాన్ని అటార్నీ జనరల్ గుర్తు చేశారు. సీజేఐకి జగన్ రాసిన లేఖ ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ లేఖపై జగన్ మీద కోర్టు ధిక్కార కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉపాధ్యాయ అటార్నీ జనరల్ కు లేఖ రాశారు. దానికి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదనే పద్ధతిలో అటార్నీ జనరల్ సమాధానం ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu