డబ్బున్న యువకులకు గాలం..నిత్య పెళ్లి కూతురు అరెస్ట్

By telugu news teamFirst Published Aug 29, 2020, 1:28 PM IST
Highlights

 ఆమె నిజస్వరూం త్వరగానే గ్రహించిన అతను వెంటనే ఆమెను వదిలేసి డెన్మార్క్ వెళ్లిపోయాడు. అయితే.. ఆమె వెంటనే భర్తపై ఫిర్యాదు చేసి.. అతనిని బెదిరించి డబ్బులు గుంజింది. అయితే.. ఇదే ప్లాన్ మరో ముగ్గురిపై కూడా అప్లై చేసినట్లు తర్వాత తెలిసింది.

తనకు పెళ్లి కాలేదని నమ్మించి.. పలువురు యువకులను మోసం చేసి వారి దగ్గర నుంచి డబ్బులు గుంజిన ఓ కిలాడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లాకు చెందిన స్వప్న అనే యువతి తన పేరుని హరిణి, కావ్యలు మార్చుకొని చలామణి అవుతోంది. కాగా..  ఈ యువతి దొనకొండ మండలంలోని వీనేపల్లికి చెందిన వీపర్ల వీరాంజనేయులు అనే యువకుడికి గాలం వేసింది. అతను డెన్మార్క్ లో ఉద్యోగం చేస్తుండగా.. మ్యాట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా పరిచయం పెంచుకుంది.

తనకు పెళ్లి కాలేదని నమ్మించి పెళ్లిచేసుకుంది. అయితే.. ఆమె నిజస్వరూం త్వరగానే గ్రహించిన అతను వెంటనే ఆమెను వదిలేసి డెన్మార్క్ వెళ్లిపోయాడు. అయితే.. ఆమె వెంటనే భర్తపై ఫిర్యాదు చేసి.. అతనిని బెదిరించి డబ్బులు గుంజింది. అయితే.. ఇదే ప్లాన్ మరో ముగ్గురిపై కూడా అప్లై చేసినట్లు తర్వాత తెలిసింది.

మహారాష్ట్ర, ఆంధ్రా, తెలంగాణలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. నంద్యాలకు చెందిన సుధాకర్‌ బెల్జీయంలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి పేరుతో అతడిని కూడా మోసం చేసి రూ.25 లక్షలు డిమాండ్‌ చేసింది. అతను పోలీసులను ఆశ్రయించగా కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఆమెపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. తిరుపతిలో ఓ మహిళ వద్ద రూ.5 లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేసింది. 

ముంబైలో పౌరోహిత్యం చేస్తూ తిరుపతిలో వేద విద్యాభ్యాసం చేస్తున్న దేవక్‌ శుక్లా పూజారిని పెళ్లి పేరుతో మోసం చేసి రూ.20 లక్షలు కొట్టేసింది. ఇలా ఆమె నిత్య పెళ్లి కూతురుగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో నిందితురాలు స్వప్నపై ఎస్‌ఐ ఫణిభూషణ్‌ కేసు నమోదు చేశారు. పలువురిని మోసం చేసి రూ.లక్షలు స్వాహా చేసి బెదిరించి ఇబ్బంది పెడుతోందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కాగా.. ఇటీవల ఆమెను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు.
 

click me!