అక్రమాలు.. సచివాలయం కార్యదర్శి అరెస్ట్

Published : Mar 06, 2021, 11:57 AM ISTUpdated : Mar 06, 2021, 12:05 PM IST
అక్రమాలు.. సచివాలయం కార్యదర్శి అరెస్ట్

సారాంశం

అప్పట్లో బాధితులు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయ స్థానం నుంచి స్టే తెచ్చుకున్న కార్యదర్శి విధుల్లో కొనసాగుతున్నారు. 

విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన కేసులో యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం సచివాలయం కార్యదర్శి షేక్ సాధిక్ అలీని పోలీసులు అరెస్టు చేశారు. 

పోలీసుల కథనం మేరకు.. సాధిక్ అలీ 2016 లో మండలంలోని కోట పంచాయతీ కార్యదర్శిగా పని చేసే సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములకు 15 మందికి తప్పుడు ధ్రువపత్రాలు మంజూరు చేశారని అభియోగం వచ్చింది. 

అప్పట్లో బాధితులు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయ స్థానం నుంచి స్టే తెచ్చుకున్న కార్యదర్శి విధుల్లో కొనసాగుతున్నారు. ఇటీవల స్టే గడువు ముగియటంతో కార్య దర్శితో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 
సాధిక్ అలీని శుక్రవారం చిలకలూరి పేట న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం