ఏపీ మున్సిపల్ ఎన్నికలు: వాలంటీర్లపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొరడా

By telugu teamFirst Published Mar 6, 2021, 11:37 AM IST
Highlights

ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల జోక్యాన్ని తగ్గించే దిశగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం వాలంటీర్లపై ఆంక్షలు విధించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వాలంటరీల్ జోక్యంపై ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల జోక్యం లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వాలంటీర్లు వ్యవహరించవద్దని చెప్పారు. 

హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు నేపథ్యంలో వాలంటీర్లపై ఆంక్షలు విధించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల జోక్యం చట్టవిరుద్ధమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. లబ్ధిదారులతో వాలంటీర్లు మాట్లాడవద్దని ఆదేశించారు. 

ఓటర్లను ప్రలోభపెడితే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని ఆయన అన్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుల్లో డబ్బుల పంపిణీపై కూడా ఈసీ నిఘా పెట్టింది. ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు పంచుతున్నారనే ఫిర్యాదులు రావడంతో ఆ దిశగా దృష్టి సారించింది. కమిషన్ కాల్ సెంటర్ కు గానీ, జిల్లా కలెక్టర్లకు గానీ డబ్బు పంపిణీ విషయంలో ఫిర్యాదులు చేయాలని నిమ్మగడ్డ సూచించారు. 

ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల్లో ఎల్లుండి ప్రచార దశ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ప్రచారం జోరును పెంచారు. ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో విశాఖపట్నంలో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో ప్రచారం సాగిస్తున్నారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ప్రచారం సాగిస్తున్నారు. మంత్రులు తమ తమ జిల్లాల్లో అభ్యర్థులను వెంట పెట్టుకుని వైసీపీ తరఫున ప్రచారం సాగిస్తున్నారు.   

click me!