తమ్ముడితో అక్రమ సంబంధం అంటగట్టి వేధింపులు.. చివరకు

Published : Mar 19, 2021, 07:35 AM IST
తమ్ముడితో అక్రమ సంబంధం అంటగట్టి వేధింపులు.. చివరకు

సారాంశం

ఆమె వరసకు తమ్ముడైన నవీన్ కు చెప్పి బాధపడేది. వీరిద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టి మరింత వేధించడం మొదలుపెట్టాడు నాగరాజు.  

తన అక్కను అనుమానిస్తున్నాడనే కోపంతో ఓ వ్యక్తి ఏకంగా  బావనే హత్య చేశాడు. కాగా.. తాజాగా ఈ కేసును పోలీసులు చేధించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పలమనేరు మండలంలోని పందివారిపల్లె వడ్డూరు గ్రామానికి చెందిన నాగరాజు(45) భార్య భాగ్యలక్ష్మిని రోజూ మద్యం తాగి వేధించేవాడు. ఈ విషయాన్ని ఆమె వరసకు తమ్ముడైన నవీన్ కు చెప్పి బాధపడేది. వీరిద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టి మరింత వేధించడం మొదలుపెట్టాడు నాగరాజు.

దీంతో.. ఆమె ఈ బాధ తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో సదరు మహిళ తమ్ముడు నవీన్ తో కలిసి ప్లాన్ వేసింది. ఈ నెల 11వ తేదీన రాత్రి మద్యం తాగించి.. నిద్రపోతున్న నాగరాజు తల మీద బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి  ఇంటికి సమీపంలో పాతిపెట్టారు.

అయితే.. నాగరాజు కనిపించడం లేదంటూ బంధువులు వెతకడం మొదలుపెట్టారు. ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్