పరిహారం చెల్లించకుండా ఖాళీ చేయిస్తున్నారు: పోలవరంపై ఏపీ హైకోర్టులో పిటిషన్

By narsimha lodeFirst Published Mar 24, 2021, 1:20 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండానే తమను ఖాళీ చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

అమరావతి:పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండానే తమను ఖాళీ చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ముంపు బాధితులకు పరిహారం ఇవ్వకుండానే  గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. 

కేంద్రం, ఏపీ ప్రభుత్వం, నీతి ఆయోగ్ ప్రాజెక్టు అథారిటీలను రెస్పాండెంట్స్ గా   పిటిషనర్ చేర్చారు.నిబంధనలకు విరుద్దంగా గ్రామాలను ఖాళీ చేయించలేదని ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. 

తదుపరి విచారణను నాలుగు వారాలకు  వాయిదా వేసింది హైకోర్టు.వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పనులు పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే  రాష్ట్ర రైతులకు ప్రయోజనంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలు చర్యలు తీసుకొంటుంది. 

ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకొంటున్నాయి. 
 

click me!