
పీడిత ప్రజల పాలిట ఈ మెగా తమ్ముడు అభయమిచ్చే ‘అన్న’గా మారుతున్నాడు. మొన్న ఉద్దానం బాధితులు, నిన్న చేనేత కార్మికులు పవన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటే ఇప్పుడు భూములు కోల్పోతున్న రైతులు పవన్ ఇంటికీ క్యూ కట్టారు.
పోలవరం ప్రాజక్ట్ మూలంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఈ రోజు జన సేన అధినేత పవన్ కల్యాణ్ ను కలసి తమ కు న్యాయం చేయాలని కోరారు. డంపింగ్ యార్డ్ పేరుతో 203 ఎకరాల భూమిని అధికారులు తమ నుంచి బలవంతంగా సేకరిస్తున్నారని పోలవరం మండలంలోని మూలలంక గ్రామవాసులు ఆయనకు విన్నవించారు.
ప్రస్తుతం భూ సేకరణ పై కోర్టు స్టే విధించినా అధికారులు దౌర్జన్యంగా తమ భూములు లాక్కుంటున్నారి వాపోయారు.
దీని పై స్పందించిన పవన్ అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ విషయంపై మంత్రులతో మాట్లాడుతానని, సమస్య పరిష్కారం కాకుంటే క్షేత్రస్థాయిలో పోరాడుతానని తెలిపారు.