గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టిన పోలవరం..

By sivanagaprasad kodatiFirst Published Jan 7, 2019, 7:41 AM IST
Highlights

ఆధునిక సాంకేతికతతో ఇంజనీరింగ్ అద్భుతంగా నిర్మితమవుతున్న పోలవరం మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ప్రతి గంటకు సగటున 1300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఫిల్లింగ్ చేపట్టి గతంలో ఉన్న రికార్డులను బద్ధలుకొట్టింది.

24 గంటల పాటు నాన్‌స్టాప్‌గా కాంక్రీటును డంప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నవయుగ సంస్థ.. ఇప్పటి వరకు 31 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటును వేసింది. ఉదయం 8 గంటల నాటికి ఇది.. 32-33 వేల క్యూబిక్ మీటర్ల మార్క్‌ను చేపట్టే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.  

ఇవాళ మధ్యాహ్నాం 12 గంటల వరకు నవయుగ సిబ్బంది కాంక్రీటు వేయనున్నారు. తద్వారా పోలవరం స్పిల్ వే కాంక్రీటు ఫిల్లీంగ్ పనులు ప్రపంచ రికార్డును సృష్టించాయి. డ్రోన్ కెమెరాల ద్వారా గిన్నిస్ బృందం కాంక్రీటు ఫిల్లింగ్ పనులను వీడియో చిత్రీకరించింది. అలాగే కాంక్రీటు పనుల వేగం, నాణ్యతను కూడా వారు పరిశీలించారు. ఇవాళ గిన్నిస్ రికార్డును అందుకునే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. 

click me!