గిన్నిస్ వేటలో పోలవరం.. 24 గంటల పాటు నాన్‌స్టాప్ కాంక్రీట్ పనులు

sivanagaprasad kodati |  
Published : Jan 06, 2019, 05:17 PM IST
గిన్నిస్ వేటలో పోలవరం.. 24 గంటల పాటు నాన్‌స్టాప్ కాంక్రీట్ పనులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించింది. తాజాగా మరో అరుదైన రికార్డు సాధించేందుకు నిర్మాణ సంస్థ, అధికారులు శ్రీకారం చుట్టారు. 

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించింది. తాజాగా మరో అరుదైన రికార్డు సాధించేందుకు నిర్మాణ సంస్థ, అధికారులు శ్రీకారం చుట్టారు.

దీనిలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ ఛానెల్‌లో 24 గంటల పాటు నాన్‌స్టాప్ కాంక్రీట్ పనులు చేపట్టారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ పనులు సోమవారం ఉదయం 8 గంటల వరకు కొనసాగనున్నాయి.

 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దీనిని నమోదు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధి అక్కడకు చేరుకున్నారు. 24 గంటల వ్యవధిలో 30 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు ఏర్పాటు చేసినట్లు నవయుగ ఎండీ బి.శ్రీధర్ తెలిపారు.

2017లో దుబాయ్‌లో ఒక టవర్ నిర్మాణానికి 36 గంటల్లో 21,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారని, ఇప్పుడు దీనిని అధిగమించేందుకు కేవలం 24 గంటల్లోనే 30 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గిన్నిస్‌బుక్ ప్రతినిధులు 24 మంది ఈ కాంక్రీటు పనులను ప్రతి 15 నిమిషాలకోసారి నమోదు చేసుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే