అనకాపల్లి జిల్లాలోని అచ్చుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో వాంతులు, తల తిరుగుడుతో తీవ్రంగా ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. వెంటనే బాధితులను యాజమాన్యం హుటాహుటిన సెజ్‌లోని ఆస్పత్రికి తరలించింది.
అనకాపల్లి జిల్లాలోని అచ్చుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీక్ అయ్యింది. సీడ్స్ యూనిట్‌లో ఒక్కసారిగా ఘాటైన వాయువు లీకైంది. దీంతో వాంతులు, తల తిరుగుడుతో తీవ్రంగా ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. వెంటనే బాధితులను యాజమాన్యం హుటాహుటిన సెజ్‌లోని ఆస్పత్రికి తరలించింది. నలుగురు మహిళలకు బ్రాండిక్స్ ఎస్ఈజేడ్‌లో ఉన్న ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
గ్యాస్ లీకేజ్ ఘటనలో ప్రాణనష్టం లేదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. ఎక్కువమంది అస్వస్థతకు గురయ్యారని.. ఆందోళనలో వున్న కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి అమర్‌నాథ్ వెల్లడించారు. కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకున్నారని మంత్రి తెలిపారు. ప్రమాదానికి కారణాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు.