అమిత్ షాతో ముగిసిన జగన్ భేటీ: ముగిసిన ఏపీ సీఎం ఢిల్లీ టూర్

By narsimha lode  |  First Published Jun 3, 2022, 12:35 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్  శుక్రవారం నాడు కేంద్ర హొం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. విభజన సమస్యలను పరిష్కరించాలని కోరారు.


న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి YS Jagan  శుక్రవారం నాడు ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి Amit shahతో భేటీ అయ్యారు.  నిన్న ప్రధానమంత్రి Narendra Modi తో చర్చించిన అంశాలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకు వచ్చారు ఏపీ సీఎం. 

మరో వైపు Andhra pradesh, Telangana మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను పరిష్కరించాలని కూడా కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు ఏపీ సీఎం జగన్ .  విభజన అంశాలపై కేంద్ర హోం మంత్రితో భేటీ సందర్భంగా జగన్ వివరించినట్టుగా తెలుస్తుంది. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్దిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, మెడికల్‌ కాలేజీలు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపుపైనా సీఎం జగన్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో చర్చించారు. అమిత్ షాతో భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్ ఢిల్లీ నుండి అమరావతికి బయలుదేరి వెళ్లారు. 

Latest Videos

నిన్న దాదాపు 45 నిమిషాల పాటు మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రెవెన్యూలోటు కింద  రూ. 32,625 కోట్లు రావాల్సి ఉందని వినతిపత్రంలో తెలిపారు. అలాగే రుణ పరిమితిలో 17,928 కోట్లు కోత విధించారని, దీనిని సరిదిద్దాలని కోరారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం  ప్రాజెక్టు అంచనాలను రూ.55,467 కోట్లకు ఖరారు చేసి నిధులు విడుదల చేయాలని కోరారు.  

ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా జగన్ భేటీ అయ్యారు.  మొదటిరోజు పర్యటన గురువారం సాగగా.. ప్రధాని మోదీ, ఆపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను కలిశారు సీఎం జగన్‌. ఆపై కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యి పోల‌వ‌రం స‌వ‌రించిన అంచనాల‌కు ఆమోదం తెల‌పాలంటూ కేంద్ర మంత్రిని కోరారు.
 

click me!