టీడీపీ ఎంపీలకు ప్రధాని మోడీ షాక్

First Published Jun 28, 2018, 11:24 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ నిరాకరించారు.

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ నిరాకరించారు. కడప ఉక్కు కర్మాగారం కోసం తమ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆ విషయంపై వివరించడానికి టీడీపీ ఎంపీలు ప్రధానిని కలవాలని అనుకున్నారు.

దాంతో ఏపీ భవన్‌లో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్ కు చంద్రబాబు రాసిన లేఖను టీడీపీ ఎంపీలు అందజేయనున్నారు. టీడీపి ఎంపీలు బుధవారంనాడు బీరేంద్ర సింగ్ ను కలిశారు.

కేంద్రం ఉక్కు కర్మాగారంపై సానుకూల దృక్పథంతో ఉందని ఆయన వారికి చెప్పారు. కానీ దాన్ని తాము విశ్వసించడం లేదని టీడీపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో వారు ప్రధానిని కలవాలని నిర్ణయించుకున్నారు.

ఇదిలావుంటే, తెలంగాణ మంత్రి కేటి రామారావు బుధవారం ప్రధాని మోడీని కలిసి బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని అమరావతిలో మంత్రి నారా లోకేష్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు - ప్రధాని మోడీ కొందరికి మాత్రమే అపాయింట్ మెంట్ ఇస్తున్నారని, కేరళ సిఎం పినరయ్ విజయన్ కు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చెప్పారు. 

click me!