PM Modi Bhimavaram Visit: భీమవరం‌కు చేరుకున్న మోదీ.. సభకు భారీగా తరలివచ్చిన జనం..

Published : Jul 04, 2022, 11:23 AM ISTUpdated : Jul 04, 2022, 12:56 PM IST
PM Modi Bhimavaram Visit: భీమవరం‌కు చేరుకున్న మోదీ.. సభకు భారీగా తరలివచ్చిన జనం..

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం భీమవరం చేరుకున్నారు. ఆయనతో పాటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ కూడా భీమవరంకు వచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం భీమవరం చేరుకున్నారు. ఆయనతో పాటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ కూడా భీమవరంకు వచ్చారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో భాగంగా.. భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. అయితే ఈ సభకు భారీగా జనం తరలివచ్చారు. పెద్ద మొత్తంలో ప్రజలు అక్కడికి చేరుకోవడంతో.. పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు వారికి సూచిస్తున్నారు. అయితే పోలీసులు కూడా ఇంత మంది వస్తారని అంచనా వేయకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. 

అయితే సభకు తరలివచ్చిన జనాల్లో కొందరు పోలీసులను దాటుకుని సభా ప్రాంగణంలోకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే పెద్ద మొత్తంలో ప్రజలు లోనికి వెళితే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో సభ పరిసరాల్లో కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే వీఐపీ కేటాయించిన మార్గాల్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. 

అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిలతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అల్లూరి కుటుంబ సభ్యులతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.  అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. అనంతరం మోదీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.  

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భీమవరం పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu