భోగాపురం ఎయిర్‌పోర్టు, ట్రైబల్ యూనివర్సిటీలకు నవంబర్ 11న ప్రధాని మోదీ శంకుస్థాపన..?

Published : Oct 27, 2022, 12:14 PM ISTUpdated : Oct 27, 2022, 01:44 PM IST
భోగాపురం ఎయిర్‌పోర్టు, ట్రైబల్ యూనివర్సిటీలకు నవంబర్ 11న  ప్రధాని మోదీ శంకుస్థాపన..?

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధికి 400 కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణ పనులను ప్రధాని తన పర్యటనలో ప్రారంభించనున్నారు. 26,000 కోట్లతో హెచ్‌పీసీఎల్ రిఫైనరీ విస్తరణ, ఆధునీకరణ ప్రాజెక్ట్, విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)లో గ్రీన్ క్యాంపస్ పనులను ఆయన ప్రారంభించనున్నారు. 

విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయంగా మంజూరైన సౌత్ కోస్ట్ రైల్ జోన్  కొత్త కార్యాలయ సముదాయం, రూ. 385 కోట్లతో నిర్మించనున్న 400 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రితో సహా విశాఖపట్నంలో మంజూరైన అనేక ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే మోదీ విశాఖ పర్యటన ఖరారు అయినట్టుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే మోదీ పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ఆయన చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేయించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. భోగాపురం విమానాశ్రయం, ట్రైబల్ యూనివర్శిటీ (సీటీయూఏపీ) కోసం భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.విమానాశ్రయ టెర్మినల్, అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి భూమిని జీఎంఆర్ అధికారులకు అప్పగించాలని జిల్లా కలెక్టర్ ఎ సూర్యకుమారిని ఆయన ఆదేశించారు.ప్రాజెక్టు వెలుపల ఉన్న వారికి అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన పునరావాస కాలనీలను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖలను కోరారు. ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. భోగాపురం ఎయిర్‌పోర్టు భూమిపూజకు ప్రధాని మోదీకి సీఎం జగన్‌ ఆహ్వానం పలికారని మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల తెలిపారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. దీంతో పాటు గిరిజన విశ్వ విద్యాలయానికి అదే నెలలో ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. అయితే మోదీ విశాఖ పర్యటనపై పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదలయ్యాక.. భోగాపురం విమానాశ్రయం, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి చేస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత రానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Reviews GSDP, RTGS & Pattadar Passbooks at AP Secretariat | Asianet News Telugu
Manchu Family Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ | Asianet News Telugu