బీపీసీఎల్ కోస్టల్ ఇస్టలేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మోడీ

By narsimha lodeFirst Published Feb 10, 2019, 11:38 AM IST
Highlights

చమురు సహజవనరులకు సంబంధించిన మూడు ప్రాజెక్టులను ప్రధానమంత్రి మోడీ జాతికి అంకితం చేశారు

గుంటూరు: చమురు సహజవనరులకు సంబంధించిన మూడు ప్రాజెక్టులను ప్రధానమంత్రి మోడీ జాతికి అంకితం చేశారు.

ఆదివారం నాడు  గంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో బీపీసీఎల్ కోస్టల్ ఇన్‌స్టలేషన్ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమంలో  మోడీతో పాటు  కేంద్ర మంత్రి సురేష్ ప్రభు,  రాష్ట్ర గవర్నర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఏపీ రాష్ట్రానికి  మోడీ పర్యటనను పురస్కరించుకొని నిరసనలు చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.దీంతో మోడీ టూర్‌కు ఏపీ సర్కార్ దూరంగా ఉంది.

బాబు కేబినెట్‌ నుండి ఏ ఒక్క మంత్రి కూడ మోడీ కార్యక్రమానికి హాజరుకాలేదు.  తొలుత ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక విమానంలో మోడీ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొన్నారు.

అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో గుంటూరుకు చేరుకొన్నారు. ఓఎన్‌జీసీకి చెందిన మూడు సంస్థలను మోడీ ప్రారంభించారు. ఆ తర్వాత  బీజేపీ ప్రజా చైతన్య సభలో మోడీ పాల్గొన్నారు.
 

click me!