చిత్తూరు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సంతాపం.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

Published : Mar 27, 2022, 02:31 PM IST
చిత్తూరు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సంతాపం.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

సారాంశం

చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాద ఘటనపై (bus accident in Chittoor) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. 

చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాద ఘటనపై (bus accident in Chittoor) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి పరిహారం అందజేయనున్నట్టుగా మోదీ చెప్పారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయంలో ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 

చిత్తూరు జిల్లాలోని భాకరాపేట ఘాట్ రోడ్డు వద్ద శనివారం రాత్రి బస్సు లోయలో పడిన ఘటనలో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయమయ్యింది. ఈ క్రమంలోనే ఇవాళ(ఆదివారం) తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేసారు. ఇందుకోసం వేణు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఓ ప్రైవేట్ బస్సులో చిత్తూరుకు బయలుదేరారు. 

అయి వీరు ప్రయాణిస్తున్న బస్సు చిత్తూరు జిల్లాలో భాకరావుపేట ఘాట్ రోడ్డుపై వెళుతుండగా దొనకోటి గంగమ్మ దేవాలయం సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. ఓ మలుపు వద్ద ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా మలుపు రావడంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా బస్సు లోయలోకి దూసుకెళ్లింది.  ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. 

ప్రమాదం జరిగిన సమయంలో పెళ్లి కుమారుడు సహా బస్సులో 52 మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు ఘటన స్థలంలోనే మృతిచెందగా... రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు, నారావారిపల్లి పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతిచెందారు. పెళ్లి కుమారుడు వేణుతో సహా 44 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రుయా ఆస్పత్రిలో 31 మంది బాధితులు, స్విమ్స్‌లో ఏడుగురు, బర్డ్ ఆస్పత్రిలో మరో ఆరుగురికి చికిత్స  పొందుతున్నారు. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 

అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చిత్తూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్‌ కమిషనర్‌ ఎం.బసిరెడ్డి తెలిపారు. ఘాట్ రోడ్‌లో మలుపు గుర్తించకుండా స్ట్రెయిట్‌గా వెళ్లడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. ఇక, ఈ ప్రమాదంలో మృతులను మలిశెట్టి వెంగప్ప, గణేష్‌, కాంతమ్మ, మురళీ, యశస్విని, ఆదినారాయణ, రసూల్‌(డ్రైవర్‌), క్లీనర్‌గా గుర్తించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: నాగరాజును కాపాడటానికే ‘సిట్‌’ దర్యాప్తు: అంబటి | Asianet News Telugu
Perni Nani Comments on Sai Krishna Case:సాయికృష్ణ కేసులో పేర్ని నాని సంచలన కామెంట్స్| Asianet Telugu