ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఈ-వాచ్ యాప్ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించనుంది.
అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఈ-వాచ్ యాప్ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించనుంది.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ నిర్వహించనుంది.ఈ-వాచ్ యాప్ పై వైఎస్ఆర్‌సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ యాప్ టీడీపీ కనుసన్నల్లో తయారైందని అధికార పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అయితే ఈ అనుమానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఈ యాప్ ను బుధవారం నాడు ఆవిష్కరించారు.యాప్ పనితీరును వివరించారు.ఈ యాప్‌నకు వ్యతిరేకంగా వైఎస్ఆర్‌సీపీ మరో యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ-నేత్రం పేరుతో మరో యాప్ ను మరోసారి అందుబాటులోకి తెచ్చింది.
also read:ఎస్ఈసీ యాప్‌పై లంచ్ మోషన్ పిటిషన్ నిరాకరణ: రేపు విచారిస్తామన్న హైకోర్టు
ఈ-వాచ్ యాప్ పై అనుమానాలను వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓ వినతిపత్రాన్ని సమర్పించింది. తమ అనుమానాలను ఈ వినతిపత్రంలో ప్రస్తావించింది.ఈ నేత్రం యాప్ ద్వారా తమకు అందిన ఫిర్యాదులను వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎస్ఈసీకి అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించనుంది.