తిరుమల ఘాట్‌‌లో కొండను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

By narsimha lodeFirst Published Nov 25, 2018, 11:36 AM IST
Highlights

తిరుమల రెండో ఘాటో రోడ్డులో ఆర్టీసీ బస్సు కొండను ఢీకొట్టింది. 


తిరుపతి: తిరుమల రెండో ఘాటో రోడ్డులో ఆర్టీసీ బస్సు కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో  సుమారు 10 మంది భక్తులకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది.

తిరుమలలోని రెండో ఘాట్‌రోడ్డులో ఆదివారం నాడు  ఆర్టీసీ బస్సు లింకు రోడ్డు వద్ద కొండను ఢీకొట్టింది.  ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని ప్రయాణీకులు తెలిపారు.

వేగంగా డ్రైవర్ బస్సును నడపడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని  ప్రత్యక్షసాక్లులు తెలిపారు.  బస్సు స్టేషన్ నుండి బస్సు బయలు దేరిన సమయంలో రెండు చోట్ల ప్రమాదం నుండి తప్పించుకొంది. ఈ ప్రమాదం వల్ల ట్రాఫిక్ జాం అయింది.   పోలీసులు  ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహనాలను తిరిగి తిరుమలకు పంపించారు.

క్షతగాత్రులను తిరుపతి రిమ్స్ కు తరలించారు. ఈ ఘటన గురించి ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు.  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అచ్చెన్నాయుడు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
 

click me!